- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు..15 ఏళ్ల వయసులోనే 'ఇండియన్ జెర్సీ' అందుకున్న వైభవ్ సూర్యవంశీ!
భారత క్రికెట్‌లో చారిత్రాత్మక క్షణం.. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక 'ఇండియన్ జెర్సీ'ని అందుకున్న బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ!

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు చోటు చేసుకుంది. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త మైలురాయిని అందుకున్నారు. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే అతను అధికారికంగా 'టీమ్ ఇండియా' (ఇండియన్ క్రికెట్ జెర్సీ) ను అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐసీసీ తదుపరి సిరీస్‌ల కోసం భారత జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఇండియన్ జెర్సీ (Indian Jersey)ని అందుకున్న అనంతరం వైభవ్ సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నతనం నుండి దేశం తరఫున ఆడాలనే తన కల ఈ రోజు జెర్సీని చేతపట్టుకోవడంతో నిజమైందని, ఈ జెర్సీని ధరించడం తన జీవితంలో అత్యంత గర్వించదగ్గ క్షణమని ఆయన పేర్కొన్నారు. కాగా వైభవ్ కు జెర్సిని అధికారికంగా అందించడంపై బీసీసీఐ ఓ వీడియోను విడుదలు చేసింది.






