కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియన్ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!

by Malleboina Mahesh |   (  Updated:2026-06-23 05:49:09  IST  )

రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసిన జార్జ్ కురియన్.. ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!

కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియన్ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకుడు, కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, మత్స్య శాఖ సహాయ మంత్రి (MoS) జార్జ్ కురియన్ (George Kurien) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆరేళ్ల రాజ్యసభ సభ్యత్వ కాలపరిమితి ముగియడం, ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఆయనను మళ్లీ ఎగువ సభకు నామినేట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) సూచన మేరకు జార్జ్ కురియన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) తక్షణమే ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

65 ఏళ్ల జార్జ్ కురియన్ 1980లో బీజేపీ స్థాపించినప్పటి నుండి పార్టీలో కొనసాగుతున్న అత్యంత నమ్మకమైన సీనియర్ నేతల్లో ఒకరు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా సేవలందించారు. నరేంద్ర మోడీ మూడో విడత ప్రభుత్వంలో జూన్ 2024 న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, కేంద్ర క్యాబినెట్‌లో క్రైస్తవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక మంత్రి కావడం గమనార్హం. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతోనే ఈసారి ఆయనకు రాజ్యసభ సీటు దక్కలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Next Story