టాలీవుడ్‌లో నివేదా పేతురాజ్ హవా.. అమ్మడు ఖాతాలోకి మరో క్రేజీ ప్రాజెక్ట్!

by Mallepaka Hamsa |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘రాపో-23’ సినిమాలో నివేదాను మెయిన్ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో నివేదా పేతురాజ్ హవా.. అమ్మడు ఖాతాలోకి మరో క్రేజీ ప్రాజెక్ట్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ కొంతకాలం పాటు తన పర్సనల్ లైఫ్ కారణాల వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. లవ్, బ్రేకప్ వంటి ఒడిదొడుకులను ఎదుర్కొన్న తర్వాత ఆమె మళ్లీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. ఇటీవల సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘సింగ్ గీతం’ సినిమాలో నివేదా ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ఆమె కెరీర్‌కు ప్లస్ పాయింట్ అయింది. అంతేకాకుండా ‘సింగ్ గీతం’ సక్సెస్‌తో నివేదా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఆమెకు స్టార్ హీరో సినిమాల్లో క్రేజీ చాన్సులు వస్తున్నాయి.

ఒక్క హిట్‌తో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన నివేదా.. ఇప్పటికే మెగా-158లో కీలక పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అలాగే వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’చిత్రంలోనూ నివేదా నటించనున్నారు. షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నివేదా పేతురాజ్‌కు టాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘రాపో-23’ సినిమాలో నివేదాను మెయిన్ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాతో రామ్ దర్శకుడిగా మారుతుండటం విశేషం. అయితే ఒకేసారి మెగాస్టార్, వెంకటేష్, రామ్ వంటి క్రేజీ స్టార్స్ సినిమాల్లో అవకాశాలు రావడంతో నివేదా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూడు చిత్రాలు కనుక హిట్టయితే నివేదా పేతురాజ్ కెరీర్ టాప్ గేరులోకి వెళ్లడం ఖాయమని, ఇవి ఆమె లైఫ్‌లో మైలురాళ్లుగా నిలుస్తాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story