​ముందస్తు అరెస్టులతో రైతుల గొంతు నొక్కలేరు: మెట్టు రాము

by Kodari Anjali |

ముందస్తు అరెస్టులతో తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గంమని బీఆర్‌ఎస్ నాయకుడు మెట్టు రాము ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ముందస్తు అరెస్టులతో రైతుల గొంతు నొక్కలేరు: మెట్టు రాము
X

​దిశ, తాడ్వాయి: యూరియా యాప్‌తో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శాంతియుతంగా ధర్నా చేయడానికి పిలుపునిస్తే, ముందస్తు అరెస్టులతో తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గంమని బీఆర్‌ఎస్ నాయకుడు మెట్టు రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. ​మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, సుమారు 3 గంటల ప్రాంతంలో పోలీసులు తన ఇంటికి వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి,తాడ్వాయి నుంచి దోమకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో రైతుల పక్షాన పోరాడే గొంతుకలను నొక్కలేదని ఆయన హెచ్చరించారు.​ఈ సందర్భంగా మెట్టు రాము మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతులు యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానికి నిరసనగా తాడ్వాయి మండల కేంద్రంలో శాంతియుత ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రైతుల యూరియా సమస్యలు పూర్తిగా తొలగిపోయేంత వరకు బీఆర్‌ఎస్ పార్టీ తరపున పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.​ పోలీస్ స్టేషన్‌లో తాడ్వాయి బీఆర్‌ఎస్ నాయకులు

​అరెస్ట్ అయిన వారిలో మెట్టు రాముతో పాటు బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు

​తాజుద్దీన్,​నరసింహులు, ​చంద్రారెడ్డి, ​శ్రీనివాస్, ​రాజగౌడ్ ​వీరితో పాటు మరికొంత మంది బీఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి దోమకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై స్థానిక రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాడ్వాయి మండల కేంద్రంలో భారీగా పోలీసులను మోహరించరు. బీఆర్ఎస్ నాయకులు తాడ్వాయికి ఎక్కడి నుంచి వచ్చినా ముందస్తుగా అరెస్టులు చేయడానికి భారీ బందోబస్తు మధ్య గస్తీ కస్తున్నారు.

Next Story