జడ్చర్ల మండల ఉపసర్పంచుల ఫోరం కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక..

by Kodari Anjali |

జడ్చర్ల మండల ఉపసర్పంచుల ఫోరం సమావేశం నిర్వహించి, నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు.

జడ్చర్ల మండల ఉపసర్పంచుల ఫోరం కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక..
X

దిశ, జడ్చర్ల: రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఆదేశాల మేరకు, ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం జడ్చర్ల మండల ఉపసర్పంచుల ఫోరం సమావేశం నిర్వహించి, నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్చర్ల మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పోలేపల్లి గ్రామ ఉపసర్పంచ్ గంధం పురుషోత్తం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

అధ్యక్షుడు గంధం పురుషోత్తం (పొలేపల్లి గ్రామ ఉపసర్పంచ్)

* వర్కింగ్ ప్రెసిడెంట్: బాలస్వామి చిన్నాధిరల ఉప సర్పంచ్

* ఉపాధ్యక్షులు: రాజు మర్రిచెట్టు తండా ఉప సర్పంచ్

* ⁠బాల్‌రెడ్డి పెద్దపల్లి ఉప సర్పంచ్

* ప్రధాన కార్యదర్శి: సతీష్ (కొండేడు గ్రామ ఉపసర్పంచ్)

* కోశాధికారి (ట్రెజరర్): ప్రశాంతి శివకుమార్ (మాచారం గ్రామ ఉపసర్పంచ్)

* కార్యదర్శులు:

* శ్రీకాంత్ (కిష్టంపల్లి గ్రామ ఉపసర్పంచ్)

* లక్ష్మణ్ (నసులాబాద్ గ్రామ ఉపసర్పంచ్)

* నరేష్ (ఉదండాపూర్ గ్రామ ఉపసర్పంచ్)

* శ్రీకర్ (మలభోయినపల్లి గ్రామ ఉపసర్పంచ్)

* రాఘవులు (ఆల్వానపల్లి గ్రామ ఉపసర్పంచ్)

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్చర్ల మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంధం పురుషోత్తం మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మండలంలోని అన్ని గ్రామాల ఉపసర్పంచులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి కోసం మండలంలోని అన్ని ఉపసర్పంచులను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని తెలిపారు. రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వం సూచనల మేరకు జడ్చర్ల మండల ఉపసర్పంచుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

Next Story