హోటల్స్, రెస్టారెంట్లలో ఇష్టారాజ్యంగా బిర్యానీల తయారీ..

by Kodari Anjali |

ఖమ్మం నగరంలో ఇష్టారాజ్యాంగం వెలుస్తున్న హోటల్లు, రెస్టారెంట్లలో కల్తీ బిర్యానీలతో ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకునే పరిస్థితి లేదు.

హోటల్స్, రెస్టారెంట్లలో ఇష్టారాజ్యంగా బిర్యానీల తయారీ..
X

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరంలో ఇష్టారాజ్యాంగం వెలుస్తున్న హోటల్లు, రెస్టారెంట్లలో కల్తీ బిర్యానీలతో ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకునే పరిస్థితి లేదు. నగరంలో నిత్యం ఏదో ఒక రెస్టారెంట్లలో బల్లులు పడడం, బొద్దింకలు, తల వెంట్రుకలు ఇలా ఏదో ఒక సమస్యతో బిర్యానీలతో బిర్యానీ ప్రియులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిన్న చిన్న హోటల్లు, తోపుడు బండ్ల వ్యాపారుల మీద ప్రతాపం చూపించే అధికారులు పెద్దపెద్ద రెస్టారెంట్ల మీద, దాబాల మీద ఎందుకు నిర్వహించడం లేదు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే ఆ రెస్టారెంట్లు దాబాల మీద తాత్కాలిక దాడులు నిర్వహించి మామూళ్లు తీసుకోవడం పరిపాటి గా మారింది అని పలువురు పేర్కొంటున్నారు. నెలరోజుల పరిధిలో బిర్యానీ సెంటర్లలో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇలా రోజుకో రెస్టారెంట్లో...

మమతా రోడ్డులో ఓ బిర్యానీ సెంటర్లో కుటుంబ సమేతంగా బిర్యానీ తిన్న ఆరుగురు కుటుంబ సభ్యులకు వాంతులు విరోచనాలు కావడం తో ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరి వైద్యం చేయించుకున్నారు. వైరా రోడ్డులో గల హవేలీ రెస్టారెంట్లో ఓ బిర్యాని ప్రియుడు ఫ్యామిలీ ప్యాక్ పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్లి తింటుండగా బిర్యానీలో బల్లి శకలం కనబడటంతో ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఆ ఘటన మరువకముందే హోటల్ కోణార్క్‌లో బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది. ఇలా రోజుకో రెస్టారెంట్లో బిర్యానీలో ఏదో ఒక అవశేషాలు కనపడడం పరిపాటిగా మారింది. ఈ ఘటనలపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ ఆ రెస్టారెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తనిఖీలు చేయలేదు అనకుండా నామమాత్రపుగా శాంపిల్స్ తీసి రెస్టారెంట్‌ల యాజమాన్యాల తో మాట్లాడుకొని చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

లైసెన్సులు లేకుండానే నడుపుతున్న హోటల్లో రెస్టారెంట్లు...

నిత్యం నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటల్లు రెస్టారెంట్లకు ఫుడ్ సేఫ్టీ అధికారుల నుండి లైసెన్సులు లేకుండా ఇష్టారాజ్యంగా నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తూ వారి జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయ్. వందల కొద్దీ హోటళ్ళు రోజుకో బిర్యానీ సెంటర్‌‌లు వెలుస్తున్న కనీసం వాటి పై కన్నెత్తి చూడకపోవడం పై పలు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.

ఇష్ట రాజ్యాంగ వంటల తయారీ...

హోటల్లో రెస్టారెంట్లలో రెండో రకం కూరగాయలు, ఫ్రిజ్జులలో నిల్వ చేసిన మటన్, చికెన్ లతో బిర్యానీలు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. దుర్వాసన వస్తున్న నూడిల్స్... నగరంలో శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో గల ఓ నూడిల్స్ షాపులో సోమవారం రాత్రి ఓ కుటుంబం న్యూడిల్స్ తినేందుకు వెళ్లగా.. అక్కడ నూడిల్స్ ఆర్డర్ చేసి తినే క్రమంలో న్యూడిల్స్ దుర్వాసన రావడంతో షాపు యజమాని అడగగా ఎవరికి రాని దుర్వాసన మీకే వస్తుందంటూ పైగా వీరిపైనే గొడవకు దిగి హల్చల్ చేసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఇదే ఘటనపై ఆహార పనికి అధికారి లోకేష్ కు ఫోన్ చేయగా నేను సెలవు లో ఉన్నాను అంటూ ఫోన్ పెట్టేయడం జరిగింది.

ఇష్టారాజ్యంగా బిర్యానీలు, వంటలు తయారు చేస్తే చర్యలు తప్పవు....

అనుమతులు లేకుండా రెస్టారెంట్లు, దాబాలో బిర్యాని సెంటర్లు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు. రెస్టారెంట్లు, హోటల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని లేనియెడల అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తాం-లోకేష్: జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్

Next Story