సమంతకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి.. మెగా మూమెంట్ అంటూ నెట్టింట రచ్చ

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-23 04:24:01  IST  )

మెగాస్టార్ చిరంజీవి దంపతులు స్టార్ హీరోయిన్ సమంత, రాజ్‌లను చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

సమంతకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి.. మెగా మూమెంట్ అంటూ నెట్టింట రచ్చ
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని సమంత తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘మా ఇంటి బంగారం’విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఈ ఏడాదిలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి దంపతులు స్టార్ హీరోయిన్ సమంత, రాజ్‌లను చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

అంతేకాకుండా ఇంటికి పిలిచి మరీ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. సమంతను, ఈ చిత్ర నిర్మాత రాజ్‌ను తన ఇంటికి పిలిపించుకున్న చిరంజీవి.. సినిమా విజయంపై కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలతో పాటు ప్రత్యేక బహుమతులను అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "మీరు చూపించిన ఆదరణ, మద్దతుకు ధన్యవాదాలు సార్. మీ ప్రశంసలు మా చిత్ర బృందానికి కొండంత బలాన్నిచ్చాయి" అని రాసుకొచ్చారు.ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు దీనిని మెగా బంగారం మూమెంట్ అని పిలుస్తున్నారు. అయితే, సమంత త్వరలోనే తల్లి కాబోతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆమెకు మెగాస్టార్ దంపతులు ప్రత్యేకంగా సారే పెట్టి ఆశీర్వదించారని కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Next Story