- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నారా రోహిత్ కుటుంబంలోకి సరికొత్త అతిథి వచ్చారు. కడుపుతో ఉన్న ఆయన భార్య శిరీష ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. శిరీష మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. నారా రోహిత్ ఇంట్లోకి వారసుడు అడుగుపెట్టాడనే గుడ్ న్యూస్ బయటకు రావడంతో అటు నందమూరి, ఇటు నారా అభిమానులు నెట్టింట తెగ హడావుడి చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. కాగా.. నారా రోహిత్, శిరీషల పెళ్లి గతేడాది అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ‘ప్రతినిధి-2’ సినిమాలో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి పీటలెక్కారు. 2024 అక్టోబర్ 13న ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట.. ఆ తర్వాత 2025 అక్టోబర్ 30న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొన్ని నెలలకే తమ జీవితంలోకి సరికొత్త వెలుగు రావడంతో ఈ స్టార్ కపుల్ ఎంతో ఆనందంలో మునిగిపోయారు. ఆర్టిస్ట్‌గా కెరీర్‌లో బిజీగా ఉన్న రోహిత్, ఇప్పుడు తండ్రిగా తన కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమయ్యారు.






