భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలిలా..

by Naga Rani Yarlagadda |

నిన్న రూ.2000 మేర పెరిగిన 10 గ్రాముల బంగారం ధర.. నేడు అదే స్థాయిలో తగ్గింది.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలిలా..
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్న రూ.2000 మేర పెరిగిన 10 గ్రాముల బంగారం ధర.. నేడు అదే స్థాయిలో తగ్గింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2070 మేర తగ్గింది. ప్రస్తుత ధర రూ.1,45,910 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1900 వరకూ తగ్గగా.. నేటి ధర రూ.1,33,750గా ఉంది. తగ్గిన ధరలకు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉండనున్నాయి. మరోవైపు కిలో వెండి ధర ఒక్కరోజే రూ.5000 పతనమై.. ప్రస్తుతం రూ.2,50,000గా ఉంది. తెలుగురాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో తేడాలు ఉండవచ్చు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం నిధులు ఉన్నాయన్న వార్తలు.. ధరల తగ్గుదలకు పరోక్షంగా కారణమైంది. లోకల్ గా బంగారం నిల్వలు లభ్యమైతే.. ఇంపోర్ట్స్ తగ్గుతాయి. ఫలితంగా బంగారం ధర అమాంతం పడిపోయే ఛాన్సుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు పెద్దగా ఆసక్తి చూపకపోగా.. ప్రాఫిట్స్ తీసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇక డిమాండ్ ను బట్టీ కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చతగ్గులు నమోదవ్వడం తెలిసిన విషయమే.

Next Story