అకాల వర్షానికి నేలకొరిగిన చెరుకు పంట..

by Kodari Anjali |

అకాల వర్షం, గాలి దుమారానికి రైతన్నకు నష్టం వాటిల్లింది.

అకాల వర్షానికి నేలకొరిగిన చెరుకు పంట..
X

దిశ, ఏన్కూర్: అకాల వర్షం గాలి దుమారం.. రైతులను నష్టాల్లో ముంచేసింది. మండలంలో చెరుకు, అరటి, మామిడి తోటలో గాలి దుమ్ములకు నేల మీద పడి రైతులకు నష్టం చేకూర్చింది పంట చేతికి వచ్చే సమయానికి గాలి దుమ్ములు రైతులను నట్టేట ముంచింది. కోళ్ల ఫారాలు రేకుల షెడ్లు, ఇంటిపై ఉన్న రేకులు గాలి దుమారాలకు సుదూర ప్రాంతం కొట్టుకుపోయాయి. చెరుకు అరటి మామిడి తోటలో నేల మీద పడి రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లే విధంగా చేసింది. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులు ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది.

Next Story