- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో స్వల్పంగా తగ్గిన రద్దీ
by Naga Rani Yarlagadda |
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. ఉదయం 8 గంటల తర్వాత ఎలాంటి టోకెన్ లేకుండా క్యూలైన్లలోకి వెళ్లేవారికి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ పొందిన వారికి 4-6 గంటలు, రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (సోమవారం) శ్రీవారిని 86,021 మంది భక్తులు దర్శించుకోగా.. 33,356 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు సమకూరగా.. 4.08 లక్షల లడ్డూలను విక్రయించారు. 2.16 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించారు.
Next Story






