- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అనూభూతిని ఏది రిప్లేస్ చేయలేదు.. అభిమానులకు అనన్య పాండే స్పెషల్ రిక్వెస్ట్!
నాకు థియేటర్‌కు వెళ్లి అన్ని రకాల చిత్రాలను చూడటం చాలా ఇష్టం. నేను ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే.. ‘దయచేసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండి’ అని మాత్రమే చెబుతాను

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ పడక అమ్మడు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఇటీవల ఆమె నటించిన ‘చాంద్ మేరా దిల్’ అలాగే కార్తీక్ ఆర్యన్‌తో చేసిన ‘తూ మేరి మైన్ తేరా..’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీంతో వరుస ఫ్లాపులు అందుకున్న అనన్య పాండే తదుపరి చిత్రం విషయంలో అచీతూచీ అడుగులు వేస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఆమె ముంబైలో జరిగిన ‘బ్యూటీవర్స్’ అనే ఒక పెద్ద ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇక ఇందులో హీరోయిన్ల అందంపై, వారు బయట ఎలా కనిపిస్తున్నారు అనే దానిపై జనాలు ఎప్పుడూ జడ్జ్ చేస్తూ ఉంటారు కదా? అని అడిగిన ప్రశ్నకు అనన్య చాలా సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. "ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది, నేను ఏదో ఒక మాట చెబితే రాత్రికి రాత్రే మారిపోదు. కానీ నా చేతుల్లో ఉన్నది నేను చేయగలను. ఇలాంటి పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు బాగా మేకప్ వేసుకుని గ్లామరస్‌గా తయారవుతాను.
కానీ షూటింగ్స్ లేనప్పుడు, నార్మల్ లైఫ్‌లో నేను చాలా సాధారణంగా ఉంటాను. ‘నేను నిద్ర లేవగానే ఇంత అందంగా ఉండను’ అని అందరికీ తెలిసేలా నా నార్మల్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పెడతాను. నా వంతుగా నేను చేయగలిగింది ఇదే" అని అనన్యా పాండే క్లారిటీ ఇచ్చారు. అలాగే పెద్ద స్క్రీన్‌పై సినిమా చూసే మజాను, ఆ ఫీలింగ్‌ను మరేదీ రీప్లేస్ చేయలేదని ఆమె అన్నారు. ప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి రకరకాల చిత్రాలు చూడాలని కోరారు. తాను ఒక పక్కా సినిమా ప్రేమికురాలినని చెప్పుకుంటూ.. "నాకు థియేటర్‌కు వెళ్లి అన్ని రకాల చిత్రాలను చూడటం చాలా ఇష్టం. నేను ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే.. ‘దయచేసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండి’ అని మాత్రమే చెబుతాను. థియేటర్లో కూర్చుని, పాప్‌కార్న్ తింటూ, డ్రింక్ తాగుతూ, ఆ రెండు రెండున్నర గంటల పాటు సినిమా ప్రపంచంలో లీనమైపోయే అనుభూతిని ఏదీ రీప్లేస్ చేయలేదు. అందుకే ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లి ఆ అనుభూతిని ఎక్స్‌పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.






