ఘోర ప్రమాదం.. తిరగబడ్డ టిప్పర్ లారీ, ముగ్గురు పిల్లలు దుర్మరణం!

by Malleboina Mahesh |

కేరళలో ఘోర ప్రమాదం.. కొల్లాం నీలేశ్వరంలో బస్ స్టాప్‌పైకి దూసుకెళ్లి తిరగబడ్డ టిప్పర్ లారీ, ముగ్గురు చిన్న పిల్లలు అక్కడికక్కడే దుర్మరణం!

ఘోర ప్రమాదం.. తిరగబడ్డ టిప్పర్ లారీ, ముగ్గురు పిల్లలు దుర్మరణం!
X

దిశ, వెబ్ డెస్క్: అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి బస్ స్టాప్ లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా కొట్టారక్కర సమీపంలో గల నీలేశ్వరం వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మట్టి లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న ఒక టిప్పర్ లారీ అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న బస్ స్టాప్‌పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ దారుణ ఘటనలో బస్ స్టాప్‌లో నిలబడి ఉన్న ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల, ఇతర అవసరాల నిమిత్తం పిల్లలు బస్ స్టాప్‌లో వేచి చూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా బస్ స్టాప్ షెల్టర్‌ను బలంగా ఢీకొట్టి, వారిపైనే తిరగబడటంతో పిల్లలు మట్టి శకలాలు, లారీ బరువు కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. దీంతో ప్రమాద స్థలంలో ఒక్కసారిగా బాధితుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, కేకలతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story