- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : మళ్ళీ ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో దేశంలో వారం రోజుల పాటు నిలిచిపోయిన ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : నీట్ (NEET) పేపర్ లీకేజీ కేసు వివాదం నేపథ్యంలో దేశంలో వారం రోజుల పాటు నిలిచిపోయిన ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' (Telegram) సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. జూన్ 16వ తేదీ నుండి జూన్ 22వ తేదీ వరకు భారత్‌లో టెలిగ్రామ్‌పై విధించిన బ్యాన్ గడువు ముగియడంతో, యాప్ సేవలు తిరిగి యథాతథంగా పని చేస్తున్నాయి.
వారం తర్వాత పనిచేస్తున్న యాప్
నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ దర్యాప్తులో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారత్‌లో టెలిగ్రామ్ యాప్‌ను వారం రోజుల పాటు నిషేధించిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రితో ఈ నిషేధ గడువు ముగిసింది. దీంతో జూన్ 23 తెల్లవారుజాము నుంచి నుండి దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. యాప్ ఇప్పుడు ఎలాంటి అంతరాయం లేకుండా సాధారణంగా పనిచేస్తోందని, మెసేజ్‌లు పంపడం, అందుకోవడం వీలవుతోందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.
ప్లే స్టోర్‌లో ఇంకా రాని అప్‌డేట్
టెలిగ్రామ్ సేవలు మళ్లీ రన్ అవుతున్నప్పటికీ, గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం ఈ యాప్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు గానీ, కొత్తగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం గానీ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఈ సాంకేతిక ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్ అయి ఉన్న యాప్‌లు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాయి.






