భాగ్యనగరంలో అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. అత్యధికంగా 12.7 సె.మీల భారీ వర్షపాతం

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన.. చందానగర్, రామచంద్రపురంలో 12.7 సె.మీ భారీ వర్షపాతం, జలమయమైన ఐటీ కారిడార్ రోడ్లు!

భాగ్యనగరంలో అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. అత్యధికంగా 12.7 సె.మీల భారీ వర్షపాతం
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ నిపుణుల అలర్ట్ ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ కుండపోత వానకు నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని ఐటీ కారిడార్, పశ్చిమ మండల ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

నగరంలో నమోదైన ప్రధాన వర్షపాత వివరాలు

చందానగర్: 12.7 సె.మీ

రామచంద్రపురం: 12.7 సె.మీ

లింగంపల్లి: 12.0 సె.మీ

శివరామ్‌పల్లి: 10.1 సె.మీ

గచ్చిబౌలి: 10.0 సె.మీ

పటాన్‌చెరు: 7.6 సె.మీ

రాజేంద్రనగర్: 6.5 సె.మీ

ప్రధానంగా చందానగర్, రామచంద్రపురం, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 నుండి 12 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షం పడినట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ తెలిపింది. ఈ భారీ వర్షం ప్రభావంతో ఉదయం కూడా రోడ్లపై వరద నీరు నిలిచి ఉండటంతో జీహెచ్‌ఎంసీ (GHMC) డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది రంగంలోకి దిగి నీటిని తొలగించే పనులను చేపట్టారు. రాబోయే 24 గంటల్లో నగరంలో మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story