Breaking News : బాసర ఆలయంలో భారీ దొంగతనం

by Muthe.Rajitha |

నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది.

Breaking News : బాసర ఆలయంలో భారీ దొంగతనం
X

దిశ, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. సరస్వతీ దేవి ఆలయ పైఅంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిని టార్గెట్ చేసిన గుర్తుతెలియని దొంగలు పెద్ద ఎత్తున దొంగతనానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

తాళాలు పగలగొట్టి.. హుండీ ఎత్తుకెళ్లి

సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు మహంకాళి ఆలయ ప్రధాన గేటు తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. గర్భగుడిలో ఉన్న అమ్మవారి వెండి కిరీటాన్ని, అలాగే అక్కడే ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. అనంతరం హుండీలో ఉన్న నగదు మొత్తాన్ని కాజేసిన దొంగలు.. ఖాళీ హుండీని సమీపంలోని వ్యాసగుడి దగ్గర పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.

ఉదయాన్నే వెలుగులోకి..

మంగళవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు నిత్య పూజల కోసం పైఅంతస్తులోని మహంకాళి గుడికి వెళ్లి చూడగా ఈ దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. గేటు విరిగిపోయి ఉండటం, లోపల సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటంతో వారు వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఆలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్స్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తూ, దొంగలను పట్టుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి దొంగతనం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Next Story