- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending: ఎంతకు తెగించార్రా..! అన్నదానాలకు సపరేటు వాట్సాప్ గ్రూప్ (వైరల్)
తెలంగాణలో గణేష్ నవరాత్రోత్సవ సంబురాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గణేష్ నవరాత్రోత్సవ సంబురాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా రకరకాల ఆకృతుల్లో గణనాథులు సందడి చేస్తున్నాయి. కలర్‌ఫుల్ లైటింగ్, ఆకట్టుకునే డెకరేషన్‌తో మండపాలు భక్తులను ఆధ్యాత్మిక మార్గం వైపునకు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెజారిటీ గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రుల వేళ అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పట్టణాల్లో పగటి వేళ.. గ్రామాల్లో రాత్రి పూట కొనసాగుతోన్న ఓ అన్నదానాలపై ఓ గ్రామానికి చెందిన యువకులు సపరేట్ వాట్సాప్ గ్రూప్‌నే క్రియేట్ చేశారు.
గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఏంటో తెలిస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే. గ్రామంలో ఎక్కడైనా అన్నదాన కార్యక్రమంలో ఉంటే మొదట గ్రూప్‌లో అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ప్రోగ్రాం మొదలైనట్లుగా మెసేజ్ రాగానే.. గ్రూప్ సభ్యులంతా స్పాట్‌కు వెళ్లి భోజనం చేసేస్తారు. అయితే, గణేష్ నవరాత్రుల వేళ అన్నదానాలపై వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్ర చూసిన నెటిజన్లు ‘వాటెన్ ఐడీయా సర్ జీ’ అని.. ‘ఎంతకు తెగించార్రా’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read..
పోర్న్ సైట్ నడిపిస్తున్న 12ఏళ్ల బాలిక.. దేశానికే సవాల్ విసిరిన కథ..






