- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: వృద్దుడిపై చేయిచేసుకున్న మహిళా కండక్టర్.. నెట్టింట్లో వీడియో వైరల్
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో వచ్చిన తిప్పలు మనం చూస్తేనే ఉన్నాం.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో వచ్చిన తిప్పలు మనం చూస్తేనే ఉన్నాం. ఏకంగా మహిళలు జుట్లు పట్టుకుని జూలువిదిల్చినట్లుగా పోట్లాటలకు దిగుతున్నారు. ఏకంగా ప్రయాణికులు డ్రైవర్, కండక్టర్లపై తిరగబడుతూ.. చితకబాదుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. బస్సెక్కిన ఓ వృద్ధుడిపై మహిళా కండక్టర్ చేయిచేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఉయ్యూరు (Uyyur) డిపోకు చెందిన బస్సులో ఓ వృద్ధుడు ఎక్కడు.
అనంతరం జేబులోంచి రూ.200 నోటు తీసి తనకు టికెట్ ఇవ్వాలంటూ కండక్టర్‌లో చేతిలో పెట్టాడు. దీంతో చిల్లర ఇవ్వాలని అడగ్గా.. తన దగ్గర లేవని ఆ వృద్ధుడు సమాధానం ఇచ్చాడు. దీంతో సదరు మహిళా కండక్టర్‌కు చిర్రెత్తుకొచ్చింది. దుర్భాషలాడుతూ.. ఏకంగా బస్సులోంచి దించేసి గల్లా పట్టుకుని చేయిచేసుకుంది. ఈ తతంగమంతా అదే బస్సులో ఉన్న ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాగా.. ఆ వీడియా కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, గతంలోనూ ఆ మహిళా కండక్టర్ పలువురు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వీడియో వైరల్ అవ్వడంతో విషయం కాస్త ఉయ్యూరు డిపో మేనేజర్ వరకు చేరింది. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీఎం వెల్లడించారు.






