Trending: అంతరిక్షంలో పేలిన ఎలన్ మస్క్ స్టార్‌షిప్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-07 12:20:29  IST  )

ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) స్పెస్ ఎక్స్‌ (SpaceX)కు చెందిన స్టార్ షిప్‌ (Star Ship)ను టెక్సాస్ (Texas) నగరం నుంచి గురువారం లాంచ్ చేశారు.

Trending: అంతరిక్షంలో పేలిన ఎలన్ మస్క్ స్టార్‌షిప్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) స్పెస్ ఎక్స్‌ (SpaceX)కు చెందిన స్టార్ షిప్‌ (Star Ship)ను టెక్సాస్ (Texas) నగరం నుంచి గురువారం లాంచ్ చేశారు. అయితే, స్టార్ షిప్‌ను ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే అది ఉన్నట్టుండి ఒక్కసారిగా అంతరిక్షంలోనే పేలిపోయింది. స్టార్ షిప్ శిథిలాలు ఆకాశంలో తారాజువ్వల్లా కనువిందు చేస్తూ ఫ్లోరిడా (Florida), బహామాస్‌ (Bahamas)లోని కొన్ని ప్రాంతాలలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే, రాకెట్ సామర్థ్యాలను పరీక్షించడం, ఫేక్ శాటలైట్స్‌ను మోహరించడమే లక్ష్యంగా పెట్టుకుని చేపట్టిన ఈ మిషన్ నిమిషాల వ్యవధిలోనే విఫలం కావడం గమనార్హం. స్పేస్ ఎక్స్ (Space X) చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన స్టార్‌షిప్ రాకెట్ అదే కావడం విశేషం, సబ్‌ఆర్బిటల్ ఫ్లైట్‌ (Suborbital Flight)ను ఆపరేట్ చేసేందుకు, నాలుగు ఫేక్ స్టార్‌లింక్ ఉపగ్రహాలను మోహరించేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లుగా స్పేస్ ఎక్స్ (Space X) ప్రతినిధులు వెల్లడించారు. కాగా, జనవరిలో ప్రయోగించిన స్టార్ షిప్ కరేబియన్ దీవుల (Caribbean Islands)పై పేలి దాని శకలాలు టర్క్స్ (Turks), కైకోస్ దీవుల (Caicos Islands)పై పడిపోయిన విషయం తెలిసిందే.

Next Story