- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending: కరడుగట్టిన నేరస్థుడిని పట్టించిన సీసీ ఫుటేజీ.. కానిస్టేబుల్ వీరోచిత పోరాటం (వీడియో వైరల్)
దొంగలు పలు రకాలు.. నేరం చేసి వెంటనే పోలీసులకు దొరికే బ్యాచ్ ఒకటైతే, కంటికి కనబడకుండా వరుస చోరీలకు పాల్పడే బ్యాచ్‌లు అనేకం ఉంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: దొంగలు పలు రకాలు.. నేరం చేసి వెంటనే పోలీసులకు దొరికే బ్యాచ్ ఒకటైతే, కంటికి కనబడకుండా వరుస చోరీలకు పాల్పడే బ్యాచ్‌లు అనేకం ఉంటాయి. తాజాగా, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీలు ఓ కరడుగట్టిన నేరస్థుడిని పట్టించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని సదాశివనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ చోరీలకు పాల్పడి, పోలీసుల కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్న హాట్‌కే మాంజాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సదాశివనగర్ ప్రాంతంలో మాంజా సంచరిస్తున్నాడనే సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని పోలీసుల జల్లెడ పట్టారు.
ఈ క్రమంలో ఓ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో హాట్‌కే మాంజా కదలికను కలిపెట్టి అక్కడే మాటు వేశారు. ఈ క్రమంలో రెడ్ సిగ్నల్ పడగానే స్కూటీపై వెళ్తున్న మాంజాను కానిస్టేబుల్ ఎదురుగా వెళ్లి అతడిని అడ్డుకున్నాడు. దీంతో తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించగా.. కానిస్టేబుల్ పట్టు విడవకపోవడంతో చివరకు అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది సాయంతో ఆ కానిస్టేబుల్ చాకచక్యంగా హాట్‌కే మాంజాను అదుపులోకి తిసుకుని స్టేషన్‌కు తరలించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.






