- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: రాష్ట్రంలో మరో ఘోరం.. ఏకంగా తండ్రి నాలుకను కోసిన తనయుడు
కన్నోళ్ల పాలిట కన్న కొడుకులే కాలయములవుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్/మెదక్ ప్రతినిధి: కన్నోళ్ల పాలిట కన్న కొడుకులే కాలయములవుతున్నారు. ఆస్తులు, భూమి, డబ్బు కోసం ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడటం లేదు. అచ్చం అలాంటి ఘటనే మెదక్ (Medak) జిల్లా హవేలీ ఘనపూర్ (Haveli Ghanapur) మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్ తండా (Aurangabad Thanda)కు చెందిన బానోత్ కీర్యాకు ఇద్దరు కుమారులు.. వారిలో పెద్ద కుమారుడు పెంట్య, చిన్న కొడుకు సంతోష్ ఉన్నారు. పెద్దోడు కుటుంబం నుంచి వేరుగా ఉంటుండగా.. ఇక సంతోష్ ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే, స్వతహాగా రైతు అయిన కీర్యాకు 1.25 ఎకరాల పొలం ఉంది. అయితే, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఖాతాలో రైతుభరోసా కింద రూ.9 వేలు జమ చేసింది.
తండ్రి ఖాతాలో డబ్బులు పడ్డాయని గ్రహించిన చిన్న కుమారుడు సంతోష్ (Santhosh) తనకు డబ్బులివ్వాలని అడిగాడు. అయితే, కీర్యా తనకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రి ఖర్చలకు రూ.5 వేలు ఖర్చు చేశానని.. తన దగ్గర ఉన్న రూ.4 వేలు ఉన్నాయని సమాధానమిచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ వంట గదిలో ఉన్న కొడవలితో దాడిచేయగా.. నాలుక తెగింది. దీంతో గమనించిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తీవ్ర రక్తస్రావం అయిన కీర్యాను మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా... నాలుకకు నాలుగు కుట్లు పడ్డాయి. కీర్యా భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.






