ఆటో డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫిదా.. ఎందుకంటే?

by Yella Dhawani Reddy |

ఏపీలో కొత్త మోటార్ వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఆటో డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫిదా.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కొత్త మోటార్ వాహనాల చట్టం (Motor Vehicles Act) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేథప్యంలో ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వాహనాదాలకు కొత్త చట్టంపై అవగాహన కల్పిస్తూ, రూల్స్ పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో (Vijayawada) ఆటో డ్రైవర్లకు (Auto drivers) ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీల్లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఇదొక సాధారణ తనిఖీగా కాకుండా.. శ్రద్ధ, నిబంధనల పట్ల నిబద్ధత ఉన్న ఒక ఆటో డ్రైవర్‌కు లభించిన అరుదైన గౌరవానికి వేదికగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రవీందర్‌రావు అనే ఆటో డ్రైవర్ ట్రాఫిక్ సీఐ కిషోర్ బాబును మెప్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసుకుని, తన జేబుపై బ్యాడ్జి పెట్టుకున్నాడు. ఆ బ్యాడ్జిపై డ్రైవర్ పేరు, లైసెన్స్ నెంబర్, బ్యాడ్జి నెంబర్ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ట్రాఫిక్ సీఐ కిషోర్ బాబు, ఎస్సై వెంకట్ కుమార్ ఆ డ్రైవర్‌ను గుర్తించి.. ఆటో డ్రైవర్లందరి సమక్షంలో అతనికి పూలమాల వేసి సన్మానించారు. ఆటో డ్రైవర్‌ రవీంద్రరావును ప్రతి ఆటో డ్రైవర్ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. రెడ్ సిగ్నల్ జంప్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఆటో డ్రైవర్‌కు యూనిఫాం లేకపోవడం, వన్ వే నిబంధన ఉల్లంఘన, ఓవర్‌లోడ్ వంటి అంశాలను గమనిస్తున్నారు. ఏ రూల్ తప్పినా రూ.1000 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వాహనదారులు ఈ విషయాలను గమనించి జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

Next Story