వాటర్ ఫాల్స్‌లో పర్యాటకులు సందడి.. దాని సడెన్ ఎంట్రీతో ఎంజాయ్ మూడ్ నుంచి ఎమర్జెన్సీ మూడ్‌కు!

by Yella Dhawani Reddy |

ప్రకృతి పరశించే పర్యాటక ప్రదేశాలకు వెళ్లటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.

వాటర్ ఫాల్స్‌లో పర్యాటకులు సందడి.. దాని సడెన్ ఎంట్రీతో ఎంజాయ్ మూడ్ నుంచి ఎమర్జెన్సీ మూడ్‌కు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి పరశించే పర్యాటక ప్రదేశాలకు వెళ్లటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. విశ్రాంతి కోసం, కొత్త అనుభూతుల కోసం, ప్రకృతిని ఆస్వాదించేందుకు చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వీలు దొరికినప్పుడల్లా టూర్లకు వెళ్తుంటారు. అయితే, పర్యటనలు అన్నీ ఎప్పుడూ కేవలం వినోదానికే పరిమితమవు. కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన, కొన్నిసార్లు భయానకమైన అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) ముస్సోరీలో (Mussoorie) ఇలాంటి ఆసక్తికర ఘటన వెలుగుచూసింది.

జూన్ 14వ తేదీన కెంప్టీ వాటర్ ఫాల్స్ (Kempty Waterfalls) వద్ద ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. జలపాతంలోని చల్లటి నీటిలో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకుల మధ్యలోకి అనుకోని అతిథిలాగా ఓ పాము దూసుకొచ్చింది. దీంతో పర్యాటకులు ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. కొంతమంది నీటిలో నుంచే బయటకు దూకారు. పాము మాత్రం తన దారిలో నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. కానీ ఆ కొన్ని సెకన్లలో పాము సృష్టించిన పానిక్ మాత్రం పర్యాటకులను గంటల పాటు వణికించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే 8 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తన్నారు. 'ఇలా పాములను వదిలితేనే ఈ రద్దీ తగ్గుతుంది' అంటూ కొందరు, 'పామే షాక్ అయ్యుంటుంది.. ఇంత మంది పాపుల మధ్య నేనెందుకు? అనుకుంటూ' అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Next Story