లోహగఢ్ కోటపై "సియా గోయల్ పాయింట్".. ఇదేం పిచ్చిరా బాబు!

by Ajay Maddhiboyina |

పిచ్చి ప‌లు ర‌కాలు అంటారు. ఒక్కొక్క‌రిదీ ఒక్కోర‌క‌మైన పిచ్చి. అలానే పూణేలోని టూరిస్టు ప్రదేశం లోహ‌గ‌ఢ్ కు వెళుతున్న టూరిస్టుల పిచ్చి చూస్తే ఆశ్చ‌ర్యం వేయ‌క‌ త‌ప్ప‌దు. ఎవ‌రైనా టూరిస్టు ప్ర‌దేశానికి వెళుతున్నారు అంటే అక్క‌డ చారిత్రక క‌ట్ట‌డాలు ఏం ఉన్నాయి.

లోహగఢ్ కోటపై సియా గోయల్ పాయింట్.. ఇదేం పిచ్చిరా బాబు!
X

దిశ‌, వెబ్ డెస్క్: పిచ్చి ప‌లు ర‌కాలు అంటారు. ఒక్కొక్క‌రిదీ ఒక్కోర‌క‌మైన పిచ్చి. అలానే పూణేలోని టూరిస్టు ప్రదేశం లోహ‌గ‌ఢ్ కు వెళుతున్న టూరిస్టుల పిచ్చి చూస్తే ఆశ్చ‌ర్యం వేయ‌క‌ త‌ప్ప‌దు. ఎవ‌రైనా టూరిస్టు ప్ర‌దేశానికి వెళుతున్నారు అంటే అక్క‌డ చారిత్రక క‌ట్ట‌డాలు ఏం ఉన్నాయి. చూడ‌ద‌గ్గ ప్ర‌దేశాలు ఏం ఉన్నాయి అని చూసుకుని వెళ‌తారు. వెళ్లిన త‌ర‌వాత అక్క‌డ ఫోటోలు దిగుతూ మురిసిపోతారు. ఆ త‌ర‌వాత వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి లైక్స్ కామెంట్స్ వ‌స్తే మ‌రింత సంబుర‌ప‌డిపోతుంటారు. నిజానికి లోహ‌గ‌ఢ్ కోట కూడా ఎంతో ఫేమ‌స్ ప్లేస్. ప్ర‌తిరోజు వేల మంది టూరిస్టులు ఇక్క‌డికి వ‌చ్చిపోతుంటారు. ముఖ్యంగా సాహ‌సాలు ఇష్ట‌ప‌డేవారు, ట్రెక్కింగ్ చేసేవాళ్లు, ప్ర‌కృతి ప్రేమికులు ఇక్క‌డ‌కు వ‌చ్చి ఎంజాయ్ చేస్తారు.

కానీ అది మొన్న‌టి వ‌ర‌కు.. ఇప్పుడు వ‌చ్చే టూరిస్టుల్లో చాలా మంది ఇటీవ‌ల సియా గోయ‌ల్ అనే యువ‌తి త‌న కాబోయే భ‌ర్త కేత‌న్ అగ‌ర్వాల్ ను కొండ‌పై నుండి తోసేసిన పాయింట్ కోసం వెతుకున్నార‌ట‌. లోహ‌గ‌ఢ్ వెళ్లిన త‌ర‌వాత మొద‌ట సియా గోయ‌ల్ పాయింట్ ఎక్క‌డ అనే సెర్చింగ్ మొద‌లుపెడుతున్నారట‌. వచ్చీరాగానే గైడ్ లను టూరిస్టులు సియా గోయల్ పాయింట్ ఎక్కడ అని అడుగుతున్నారట. ఇక్కడకు వస్తున్న టూరిస్టుల సంఖ్య కూడా సియా గోయల్ కేతన్ ను కోటపై నుండి తోసేసి చంపిన తరవాత 25 శాతం పెరిగిందట. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు మీకు ఇదేం పిచ్చిరా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story