- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊహాజనిత బడ్జెట్ వద్దు.. వాస్తవికంగానే వెళ్దాం: ఆదాయ సమీకరణపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఆదాయ సమీకరణ, బడ్జెట్ రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను విజయవంతంగా సాధించాలంటే ఆదాయ సమీకరణపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఆదాయం పెంపుదల, నిధుల సమీకరణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఆయన క్యాంపు ఆఫీసులో ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదాయ లీకేజీలను అరికట్టడానికి HMDA, TGIIC, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ వంటి కీలక శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఆదాయ పెంపు ప్రక్రియను రోజువారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక ‘చేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేసి, నిరంతరం ఫాలోఅప్ చేయాలని సూచించారు.
ప్రభుత్వ పథకాల పారదర్శకత కోసం సరికొత్త సాంకేతికతను వాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI టెక్నాలజీ)ని ఉపయోగించుకుని లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయాలని, దానిని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT)కి అనుసంధానం చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఇకపై కేవలం అంకెలకే పరిమితమయ్యే ఊహాజనిత బడ్జెట్ కాకుండా, క్షేత్రస్థాయి వాస్తవికత ఆధారంగానే కొత్త బడ్జెట్‌ను రూపొందించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు ఉండాలని, అందుకోసం భూసేకరణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించాలంటే శాఖల వారీగా అధికారులు తమ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.






