మహేష్ బాబు వాయిస్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ‘రావు బహదూర్’ ట్రైలర్

by Mallepaka Hamsa |

"నాటకానికి లాజిక్ ఉండదు అంటారు.. కానీ నాటకానికి మాయ తోడైతే లాజిక్కే మారిపోతుంది" అంటూ మహేష్ బాబు చెప్పే గంభీరమైన డైలాగ్స్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మహేష్ బాబు వాయిస్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ‘రావు బహదూర్’ ట్రైలర్
X

దిశ, సినిమా: నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రావు బహదూర్’. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. మహేష్ బాబు సమర్పణలో జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపా థామస్, మాల పరాశర, వికాస్ ముప్పాళ్ల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకున్న ఈ మూవీని జూలై 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు తన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం.

"నాటకానికి లాజిక్ ఉండదు అంటారు.. కానీ నాటకానికి మాయ తోడైతే లాజిక్కే మారిపోతుంది" అంటూ మహేష్ బాబు చెప్పే గంభీరమైన డైలాగ్స్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో చివరి స్టేజ్ లివర్ క్యాన్సర్‌తో మరణానికి దగ్గరై, ఆ తర్వాత ఒక అద్భుతం వల్ల బతికిన వ్యక్తిగా రామయ్య అలియాస్ రావు బహదూర్ పాత్రలో సత్యదేవ్ అద్భుతమైన నటనను కనబరిచారు. తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని ఒక మైండ్ బ్లోయింగ్ లాంటి సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ చిత్రం అందించబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. డార్క్ కామెడీ, సస్పెన్స్, మ్యాజికల్ రియలిజం వంటి విభిన్నమైన ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ మూవీ ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.


Next Story