Technology : నీటిలా ప్రవహిస్తూ.. రాతిలా గట్టిపడుతుతూ..!

by Javid Pasha |

ఒక విప్లవాత్మక రోబోటిక్ మెటీరియల్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది నీటిలా ప్రవహించగలదు. రాయిలా మారుతూ వెళ్లగలదు.

Technology : నీటిలా ప్రవహిస్తూ.. రాతిలా గట్టిపడుతుతూ..!
X

దిశ, ఫీచర్స్ : ప్రవహిస్తున్న నీటిని మీరెప్పుడైనా ప్రత్యేకించి పరిశీలించారా? విశాలమైన ప్రదేశంలో ఉన్నప్పుడు అందుకు తగినట్టుగా దాని ఆకారాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్తుంది. చిన్న కాలువలో సైతం అందుకు సరిపోయేలా తన ప్రవాహ తీరును మలచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎత్తు-పల్లాలు, అడ్డంగా వచ్చే అవరోధాలను దాటుతున్నప్పుడు, ఇరుకైన ప్రదేశాల్లోంచి తనను తాను అందుకు అనుగుణంగా మార్చుకుంటూ సాగుతూనే ఉంటుంది. ఈ విధమైన అవకాశం జంతువులకు, మనుషులకు, యంత్రాలకు ఉండదు. అయితే ఆధునిక సాంకేతికత దీనిని నిజం చేసిందని నిరూపించారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సాంటా బార్బరా(UCSB) & TU డ్రెస్డెన్ (జర్మనీ) శాస్త్రవేత్తలు. దాని ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పరిస్థితులకు అనుగుణంగా..

ఎటువంటి పరిస్థితుల్లోనైనా తనను తాను మార్చుకుంటూ ముందుకుసాగే ఒక విప్లవాత్మక రోబోటిక్ మెటీరియల్‌(Shape-shifting Robotic Material)ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది దానిని నియంత్రించే వ్యక్తి ఆదేశానికి తగ్గట్టు పూర్తి గట్టిగా (రాక్-సాలిడ్) ఉండి, మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించే ద్రవ స్థితికి మారగలదు. అంతేకాకుండా చిన్న డిస్క్ ఆకారపు రోబోట్ల సమూహం(magnets, motors, light sensors)తో కలిసి వర్క్ చేయడం, తన ఆకారాన్ని మార్చుకోవడం, లోపాలు ఏమైనా తలెత్తితే తనను తాను రిపేర్ చేసుకోవడం, పర్యావరణానికి అనుగుణంగా మారడం వంటివి చేస్తుంది. కాబట్టి దీనిని సెల్ఫ్ హీలింగ్ రోబో అని కూడా పిలుస్తున్నారు.

అలాంటి చోట్లలో కూడా..

ఈ టెక్నాలజీ రోబోటిక్స్ & ఇంజినీరింగ్ రంగాలను పూర్తిగా మార్చేస్తుందని భావిస్తున్నారు. సాధారణ లోహాలు, ప్లాస్టిక్‌లతో కాకుండా, భారీ బరువులను మోసే స్ట్రక్చర్లు అవసరమైనప్పుడు గట్టిపడి, షాక్ అబ్జార్బ్ చేయాల్సినప్పుడు లిక్విడ్‌గా మారి, ఇరుకైన చోట్ల కూడా దూరి వెళ్లగలవు. బయాలజీని, రోబోటిక్ ఇంటెలిజెన్స్ స్కిల్స్‌ని మిళితం చేసి తయారైన ఈ మెటీరియల్ భవిష్యత్తులో కేవలం నిర్మించబడటమే కాకుండా.. “జీవం”తో కూడినవిగా ఉండే సాంకేతికక అవకాశాలపై ఆశలు పెంచుతున్నదని నిపుణులు అంటున్నారు. ఈ పరిశోధన రోబోట్లు, ఆటోమేటెడ్ స్ట్రక్చర్లు, మెడికల్ డివైసెస్ వంటి అనేక రంగాల్లో సరికొత్త మార్పులకు దారితీస్తుందని భావిస్తున్నారు. అయితే ఇంకా పరిశోధనా దశలోనే ఉంది. అందుబాటులోకి రోబోటిక్ టెక్నాలజీలో మరో అద్భుతం జరిగినట్టేనని నిపుణులు చెబుతున్నారు.

Next Story