- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దని మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం అన్నారు .

దిశ, చండూరు : విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దని మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం అన్నారు. బుధవారం చండూరు మున్సిపాలిటీ పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS), కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో వంటకాల తయారీ విధానం, వంటశాల, భోజనశాలల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి వారికి అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. అలాగే పాఠశాల ఆవరణలో వర్షపు నీటి సంరక్షణ (Rainwater Harvesting) వ్యవస్థను ఏర్పాటు చేయాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేసి మొక్కలకు వినియోగించాలని సూచించారు. ఈ తనిఖీలో మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఎ. సాయిభారద్వాజ్, వార్డ్ ఆఫీసర్ బి. సాయిరాం, పర్యావరణ ఇంజనీర్ యమ్. అరవింద్ రెడ్డి పాల్గొన్నారు.






