- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్‌ఫార్మర్ గద్దెల నిర్మాణంలో నాణ్యతా లోపాలా..?
బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలను తగ్గించేందుకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు నిర్మించిన గద్దెల నాణ్యత పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, బజార్‌హత్నూర్ : బజార్‌హత్నూర్ మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలను తగ్గించేందుకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు నిర్మించిన గద్దెల నాణ్యత పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయకముందే గద్దెల పరిస్థితి ఇలా ఉంటే, వాటి పై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసిన తర్వాత భద్రత పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొత్త బస్టాండ్ సమీపంలో నిర్మించిన ట్రాన్స్‌ఫార్మర్ గద్దె నిర్మాణం పూర్తయి రెండు నెలలు కూడా గడవక ముందే నేలమట్టం కావడం నిర్మాణ పనుల నాణ్యత పై, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పై సందేహాలు రేకెత్తిస్తోంది. ఫోటోల్లో కనిపిస్తున్న విధంగా గద్దె భాగం కుంగిపోవడంతో పాటు, నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రి, పనుల నాణ్యత పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ శాఖ సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన ఈ పనులు ప్రజల భద్రతకు సంబంధించినవని, ఇలాంటి నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసిన తర్వాత దాని బరువు పెరిగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన పనుల్లో ఇలాంటి నిర్లక్ష్యం ఎందుకు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ గద్దెల నిర్మాణానికి ఎవరు బాధ్యత వహించారు. కాంట్రాక్టర్ ఏ విధంగా పనులు చేపట్టారు. నాణ్యతను ఎవరు పరిశీలించారు అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే ఘటనను పరిశీలించి, నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నట్లు తేలితే బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






