ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే?

by Chukka Sudharani |

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’.

ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్, సలార్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. దేశవ్యాప్తంగా రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇండియా లెవల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. తాజాగా చిత్రీకరణకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ప్రజెంట్ డ్రాగన్ కొత్త షెడ్యూల్ ప్రారంభమైందని తెలుస్తుండగా.. ఎర్లీ మార్నింగ్ 6:15కి లైటింగ్ సెట్స్ సెట్ చేస్తున్న ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత చిత్రబృందం తదుపరి షెడ్యూల్ కోసం శ్రీలంక వెళ్లనుందట. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ మూవీని మైత్రీ మూవీమేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నాడు.

Next Story