- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరల్ మోజు.. ప్రాణాలతో చెలగాటం! కదులుతున్న రైలు డోరుకు వేలాడుతూ మహిళ వీడియో.. నెటిజన్ల ఫైర్!
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న మోజు.. లైకులు, వ్యూస్ సాధించాలన్న అత్యాశ ప్రజలను ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న మోజు.. లైకులు, వ్యూస్ సాధించాలన్న అత్యాశ ప్రజలను ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేస్తోంది. తాజాగా ఓ మహిళ కేవలం ఓ వైరల్ వీడియో కోసం తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా చేసిన సాహసం ప్రస్తుతం నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ మహిళ కదులుతున్న రైలు డోరు వద్ద బయటకు వేలాడుతూ అత్యంత ప్రమాదకరమైన రీతిలో ఓ వీడియోను చిత్రీకరించింది. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాల్లో కలిసే ఆ పరిస్థితుల్లో ఆమె చేసిన ఈ స్టంట్ చూసి ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు సదరు మహిళ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
లైక్స్ కోసం పిచ్చి పనులు వద్దు
కేవలం రెండు నిమిషాల గుర్తింపు, వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఎంతవరకు సమంజసం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలు వారి ప్రాణాలకే కాకుండా, తోటి ప్రయాణికుల భద్రతకు కూడా తీవ్ర ముప్పుగా పరిణమిస్తాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాగా, ఈ ఘటన ఎక్కడ జరిగింది? సదరు మహిళ ప్రయాణిస్తున్న రైలు నంబర్, ఆమె వివరాలు వంటివి ఇంకా తెలియరాలేదు. అయితే, వీడియోను బట్టి ఆమె ఉత్తరాదికి చెందిన మహిళ అయి ఉంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించకూడదని, రైల్వే అధికారులు వెంటనే స్పందించి నిబంధనలు ఉల్లంఘించిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే ఇలాంటి స్టంట్లకు అడ్డుకట్ట పడుతుందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. వీడియో లింక్..






