- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్, పాక్ ఖైదీల జాబితాల మార్పిడి.. పాక్ జైళ్లలో 198 మంది భారత మత్స్యకారులు
తమ దేశాల్లో జైళ్లలో మగ్గుతున్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను భారత్, పాకిస్తాన్ ఇవాళ పరస్పరం మార్చుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) దేశాలు తమ ఆధీనంలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల (Fishermen) తాజా జాబితాలను పరస్పరం మార్చుకున్నాయి. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో ఒకేసారి ఏకకాలంలో ఈ ప్రక్రియ ముగిసింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా ఉన్న ఒప్పందాల ప్రకారం ఈ వివరాలను ఇరుపక్షాలు షేర్ చేసుకున్నాయి. భారత్ అందించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం మన కస్టడీలో 386 మంది పాకిస్తానీ పౌర ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారులు ఉన్నారు. ఇక పాకిస్తాన్ ప్రభుత్వం అందించిన జాబితా ప్రకారం.. వారి జైళ్లలో 52 మంది భారతీయ పౌర ఖైదీలతో పాటు 198 మంది భారతీయ మత్స్యకారులు మగ్గుతున్నారు.
అయితే, పాక్ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలు, మత్స్యకారులందరినీ త్వరగా విడుదల చేసి, స్వదేశానికి రప్పించేందుకు (Repatriation) అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. అంతేకాకుండా, వారిని విడుదల చేసే ప్రక్రియ పూర్తయ్యే లోపు జైళ్లలో ఉన్న భారతీయులందరి భద్రత, క్షేమ సమాచారాలు, సంక్షేమాన్ని కచ్చితంగా పర్యవేక్షించాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.






