- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
*నిర్ణీత గడువులోపు ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి*
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని, ఈ ప్రక్రియను ఎలాంటి సందేహాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని, ఈ ప్రక్రియను ఎలాంటి సందేహాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం ఇప్పటికే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసిందని, ప్రతి దశను నిర్దేశిత సమయపట్టిక ప్రకారం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియ సక్రమంగా జరుగుతున్న తీరును పరిశీలించవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియపై పరస్పర విశ్వాసం పెంపొందించేందుకు ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను పునర్వ్యవస్థీకరించి, ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని, అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, సవరణల కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి, ఆర్డీవో కృష్ణవేణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కుషీల్ వంశీ, ఏఈఆర్‌ఓ, తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల సిబ్బంది, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.






