అందరి ముందు అతి చేసిన టూరిస్ట్.. 300 అడుగుల లోయలో కారుతో సహా పడి.. (వీడియో)

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-11 12:52:06  IST  )

అతి చేయకు, అతి అన్నింటా మంచిది కాదని ఊరికే చెప్పరు పెద్దలు. మహారాష్ట్రలోని పటన్ - సదవఘాపూర్ రోడ్ టేబుల్ పాయింట్ చూసేందుకు వెళ్లిన టూరిస్టుల్లో సాహిల్ అనిల్ జాదవ్..

అందరి ముందు అతి చేసిన టూరిస్ట్.. 300 అడుగుల లోయలో కారుతో సహా పడి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అతి చేయకు, అతి అన్నింటా మంచిది కాదని ఊరికే చెప్పరు పెద్దలు. మహారాష్ట్రలోని పటన్ - సదవఘాపూర్ రోడ్ టేబుల్ పాయింట్ చూసేందుకు వెళ్లిన టూరిస్టుల్లో సాహిల్ అనిల్ జాదవ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో అక్కడికి వెళ్లిన సాహిల్ ఆ ప్రాంతమంతా కారులోనే తిరిగాడు. ఎటుచూసినా జనమే ఉండటంతో వారి అటెన్షన్ కోసం కారుతో స్టంట్లు వేసి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. అదంతా లోయప్రాంతం కావడంతో కారుపై సాహిల్ పట్టు కోల్పోయాడు. తన కారుతోపాటు 300 అడుగుల లోయలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా.. పటన్ - సదవఘాపూర్ రోడ్ టేబుల్ పాయింట్ పర్యాటకం కంటే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోందని పలువురు వాపోతున్నారు. ఆ ప్రాంతంలో సేఫ్టీ వాల్స్, వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రకృతి ప్రేమికుల్ని అలరించినా.. భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Next Story