Airlines : ప్రపంచంలో టాప్ సురక్షిత విమాన సంస్థలివే

by Muthe.Rajitha |

ఇటీవల అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash) అనంతరం ప్రపంచంలో సురక్షిత విమాన సంస్థల(Safest Airways) గురించి నెటిజన్స్ తెగ వెతుకుతున్నారట.

Airlines : ప్రపంచంలో టాప్ సురక్షిత విమాన సంస్థలివే
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash) అనంతరం ప్రపంచంలో సురక్షిత విమాన సంస్థల(Safest Airways) గురించి నెటిజన్స్ తెగ వెతుకుతున్నారట. ఈ నేపథ్యంలో వరల్డ్ లోనే టాప్ 5 మోస్ట్ సేఫెస్ట్ విమాన సంస్థల జాబితాను ఎయిర్ లైన్ రేటింగ్ అనే సంస్థ విడుదల చేసింది. ఇది 385 విమాన సంస్థలను పరిశీలించి.. ఫ్లైట్ వయస్సు, సేఫ్టీ ఆడిట్స్, పైలట్ శిక్షణ, ఇన్సిడెంట్స్ రేటు, ఫెసిలిటీస్ వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది.

టాప్ 5 సెఫెస్ట్ ఫుల్-సర్వీస్ విమాన సంస్థలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

1) ఎయిర్ న్యూజిలాండ్ - రెండో ఏడాది వరుసగా మొదటి స్థానంలో నిలిచింది, దీని సగటు వయస్సు 9.5 సంవత్సరాలు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో, అద్భుతమైన పైలట్ నైపుణ్యం, ఆధునిక సాంకేతికతతో గుర్తింపు పొందింది.

2) క్వాంటాస్ - ఎయిర్ న్యూజిలాండ్‌తో 1.5 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచింది. 100 ఏళ్ల చరిత్రలో అత్యుత్తమ సేఫ్టీ రికార్డ్ ఉంది. గతంలో 2014-2017 మధ్య నాలుగు సార్లు మొదటి స్థానం సాధించింది

3) కాథే పసిఫిక్ - 11.6 సంవత్సరాల సగటు ఫ్లీట్ వయస్సు, సేఫ్టీ రికార్డ్.

4)కతర్ ఎయిర్‌వేస్ - కతర్ ఎయిర్‌వేస్ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (స్కైట్రాక్స్ ప్రపంచ ఉత్తమ ఎయిర్‌పోర్ట్)

5)ఎమిరేట్స్ - ఎమిరేట్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ హబ్‌తో అత్యుత్తమ సేఫ్టీ రికార్డ్

ఈ ర్యాంకింగ్‌లో పైలట్ శిక్షణ, సేఫ్టీ ప్రోటోకాల్స్, తక్కువ ఇన్సిడెంట్స్ కీలకంగా ఉన్నాయి. ఈ విమాన సంస్థలు అంతర్జాతీయ లాంగ్-హాల్ ఫ్లైట్స్‌లో అగ్రస్థానంలో ఉండడంతో పాటు, అత్యాధునిక ఫ్లీట్, గ్లోబల్ సేఫ్టీ ఆడిట్స్‌లో ఉత్తీర్ణత సాధించడం వల్ల ఈ ర్యాంకింగ్‌లో చోటు దక్కించుకున్నాయి.

Next Story