బ్యాట్ పట్టిన మూడేళ్ల బుడ్డోడు.. సూపర్ షాట్లు, వీడియో వైరల్!

by Yella Dhawani Reddy |

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉండే క్రేజే వేరు.

బ్యాట్ పట్టిన మూడేళ్ల బుడ్డోడు.. సూపర్ షాట్లు, వీడియో వైరల్!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు (Cricket) ఉండే క్రేజే వేరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఆటను ఇష్టపడుతుంటారు. ఇక ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ (IPL) ఫీవర్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఓ సూపర్ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. మూడేళ్ల బాలుడు (3 years boy) అద్భుతంగా తన బ్యాటింగ్ శైలిని ప్రదర్శిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎంఎస్ ధోనిలాగే హెలికాప్టర్ (Dhoni helicaptor shot) షాట్లు బాదుతూ క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకుంటోన్నాడు.

నిర్మానుషంగా ఉన్న రోడ్డుపై ఓ మూడేళ్ల బాలుడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఉన్నాడు. అతడి వైపు బాలు దూసుకురాగానే అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్‌తో కాన్ఫిడెంట్‌‌గా ధోని హెలికాప్టర్ షాట్ బాదాడు. చిన్నారి బ్యాటింగ్ చేసే విధానం క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అది కూడా టైమింగ్ చూసి మరీ షాట్లు బాదుతుంటే.. ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. లాంగ్ ఆన్ దిశగా, కవర్స్ దిశగా పవర్ ఫుల్ షాట్లు బాదడం, లాఫ్టెడ్ షాట్లు కొట్టడం చూసి స్టార్ క్రికెటరల్తో పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఫ్యూచర్ క్రికెట్ స్టార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story