VIRAL : బట్టతల ఉందని బాధపడకు బ్రో.. లక్షల్లో సంపాదించే మార్గం ఇదిగో..

by Sujitha Rachapalli |   (  Updated:2025-03-04 12:02:20  IST  )

జుట్టు.. ముఖానికి అందం తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌కు అంత డిమాండ్ ఉంటుంది. ఎన్ని స్టార్టప్స్ కొత్తగా పుట్టుకొచ్చినా.. సేల్స్ అద్భుతంగా ఉంటూ లాభాల బాటలో నడుస్తాయి

VIRAL : బట్టతల ఉందని బాధపడకు బ్రో.. లక్షల్లో సంపాదించే మార్గం ఇదిగో..
X

దిశ, ఫీచర్స్ : జుట్టు.. ముఖానికి అందం తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌కు అంత డిమాండ్ ఉంటుంది. ఎన్ని స్టార్టప్స్ కొత్తగా పుట్టుకొచ్చినా.. సేల్స్ అద్భుతంగా ఉంటూ లాభాల బాటలో నడుస్తాయి. కానీ ఎంత ప్రయత్నించినా కొందరికి బట్టతల రాకుండా మానదు. ముఖ్యంగా అబ్బాయిల్లో బాల్డ్ హెడ్ ఎక్కువ. దీనివల్ల కొందరు పదిమందిలో కలిసేందుకు ఇబ్బంది పడుతారు. లైఫ్‌లో వెనుకబడి పోతారు. కానీ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం బట్టతలనే బిల్ బోర్డ్‌గా మార్చేసి..బ్రాండ్‌ యాడ్స్‌కు వాడుతున్నాడు.

కేరళకు చెందిన 36ఏళ్ల షఫీక్ హసీమ్ ట్రావెల్ వ్లాగర్‌గా భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ ఫేమ్‌ను క్యాష్ చేసుకోవాలనే బట్టతల స్పేస్ యాడ్

క్రియేటివ్ ఐడియాను ఆన్ లైన్‌లో షేర్ చేయగా.. రెస్పాన్స్ అదిరింది. La Densitae అనే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్ తనను అప్రోచ్ అయింది. సింగిల్ యాడ్‌కు రూ.50వేలు చెల్లించి ప్రమోట్ చేసుకుంది. మొత్తానికి ఈ విధంగానూ ఓ ఇన్‌కమ్ సోర్స్ ఏర్పరుచుకున్న షఫీక్..ఇలా పబ్లిక్‌లో తిరుగుతూ అటెన్షన్ క్యాచ్ చేశాడు. క్రియేటివిటీకి లిమిట్స్ ఉండవని ప్రూవ్ చేశాడు.

Next Story