గ్రహాలు డ్యాన్స్ చేయడం అంటే ఇదేనేమో భయ్యా.. వీడియో వైరల్

by D.Reddy |
గ్రహాలు డ్యాన్స్ చేయడం అంటే ఇదేనేమో భయ్యా.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మన సౌర కుటుంబంలో (Solar family) సూర్యుడితో (Sun) పాటు తొమ్మిది గ్రహాలున్నాయి. అవి.. బుధుడు, శుక్రుడు, భూమి (Earth), అంగారకుడు, గురుడు (Jupiter), శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. అయితే, 2006లో ఖగోళ శాస్త్రవేత్తలు ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలిగించారు. ఇక ఈ గ్రహాలన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ.. గురుత్వాకర్షణ శక్తి కారణంగా సూర్యుడి చుట్టూ ఒక దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. అయితే, ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ ఒక కక్ష్య పూర్తి చేయడానికి వాటి దూరాన్ని బట్టి సమయం పడుతుంది. బుధుడు సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ తిరగడానికి సుమారు 88 రోజులు పడుతుంది. శుక్ర గ్రహానికి సుమారు 225 రోజులు పడుతుంది. భూమి 365.25 రోజులు తీసుకుంటుంది. అంగారకుడు సూర్యుడిని ఒకసారి చుట్టేయడానికి సుమారు 687 రోజులు తీసుకుంటుంది. గురుడు (అతి పెద్ద గ్రహం) సుమారు 11.86 సంవత్సరాల కాలం పడుతుంది. శని సుమారు 29.46 సంవత్సరాలు, యురేనస్ సుమారు 84 సంవత్సరాలు, నెప్ట్యూన్ సుమారు 164.8 సంవత్సరాలు, ప్లూటో సుమారు 248 సంవత్సరాల కాలం తీసుకుంటాయి. పడుతుంది.

ఇటీవల ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ (Dorje Angchuk) భూభ్రమణాన్ని వీడియోలో బంధించాడు. అయితే, ఇది మిగతా గ్రహాలకు సాధ్యం కాదు. ఆ గ్రహాల భ్రమణాన్ని పలు సాఫ్ట్‌వేర్‌లు రియల్-టైమ్‌లో చూపిస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఇందులో అన్ని గ్రహాలు లేవు, కేవలం భూమి, జూపిటర్ గ్రహాల భ్రమణాలను చూపించారు. ఈ రెండు గ్రహాలు సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నాయి. ఇక ఈ వీడియోలో గురు గ్రహం సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేసే సరికి భూమి 12 సార్లు చుట్టేస్తుంది. చూసేందుకు రెండు గ్రహాలు డ్యాన్స్ చేస్తున్నాయా? అన్నట్లుగా అందంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ఖగోళ ప్రియులు తెగ లైక్ కొడుతూ షేర్ చేస్తున్నారు.



Next Story

Most Viewed