- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన లవర్స్.. చివరికి జరిగింది ఇదే!?
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగిన నిమిషాల్లో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియా(Social Media)లో వింతలు, విశేషాలు, షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలకు కొదువ లేదు. ఈ తరుణంలో తాజాగా నెట్టింట ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. యూపీ(Uttar Pradesh)లోని నోయిడాలో బైక్ పై ఓ జంట రెచ్చిపోయింది. ఈ జంట హెల్మెట్ ధరించకుండా, వేగంగా బైక్ నడుపుతూ, ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు.
వివరాల్లోకి వెళితే.. యువకుడు బైక్ నడుపుతుండగా అమ్మాయి ముందు ట్యాంకర్ మీద కూర్చొని అతనితో రొమాన్స్ చేసింది. ఇదంతా వెనుక ఉన్న వాహనాదారులు వీడియో తీశారు. రహదారిపై ఆ జంట చేసిన చేష్టలతో ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన పై పోలీసులు స్పందించారు. ఈ తరుణంలో ఆ ప్రేమ జంటకు ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బైక్ పై రొమాన్స్ చేసిన ఆ జంట పై ట్రాఫిక్ పోలీసులు వివిధ కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. హెల్మెట్ లేకపోవడం, ప్రమాదకర డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలను అతిక్రమించడం వంటి ఆరోపణల కింద ఈ జంటకు రూ.53,500 జరిమానా విధించి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన లేకపోవడం పై తీవ్ర చర్చకు దారితీసింది.






