- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Video Viral:‘మెట్రోలో ఇదేం పని.. పోలీసుల ఆగ్రహం’.. సారీ చెప్పిన మహిళలు!
ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూస్తుండడం గమనిస్తూనే ఉన్నాం.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూస్తుండడం గమనిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలామంది రీల్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా రీల్స్ చేసి అందరిని తమ వైపు ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మెట్రోలో మహిళల బృందం చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రోలో వెలుగు చూసిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెట్రో ప్రయాణంలో కొంతమంది మహిళలు కీర్తనలు(భక్తి గానం), భజనలు చేస్తున్నారు.
మహిళలు మెట్రో కోచ్‌లలోని కొన్ని విభాగాలలో కూర్చుని ఉన్నారు. మరికొందరు నేలపై కూర్చుని ధోలక్, మంజీరా వంటి సంగీత వాయిద్యాలు వాయించారు. వారి చుట్టూ ఉన్న ప్రయాణికులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పట్టించుకోకుండా సంగీత వాయిద్యాలతో శబ్దాలు చేస్తూనే ఉన్నారు. ప్రయాణికులు జర్నీలో అనవసరమైన సంగీతంతో ఇబ్బంది పడుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. అయితే.. కొంతమంది మహిళలు పాడటం కొనసాగిస్తుండగా.. భద్రతా సిబ్బంది వచ్చారు. ఈ క్రమంలో మహిళలు వెంటనే ఆపేశారు. మెట్రో నిబంధనల ప్రకారం.. ఇది సరైనది కాదని భద్రతా సిబ్బంది వారికి తెలియజేశారు. ఈ క్రమంలో మహిళలు తమ ప్రవర్తనకు సున్నితంగా క్షమాపణలు చెప్పారు. ఈ క్లిప్‌ను యూజర్ బిల్సండా7011 ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో 2 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 87,000 లైక్‌లను పొందింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఒకరేమో "దేవుని పట్ల భక్తి మంచిది, సంస్కృతిని అనుసరించడం కూడా మంచిది, కానీ అనవసరమైన భక్తి మంచిది కాదు" అని కామెంట్ పెడుతున్నారు. మరికొందరు ఇవన్నీ జరిగే చోటు ఇది కాదు’ అని, ఈ ఘటన పై కాదు మెట్రోలో అనుచిత కార్యకలాపాలపై పోలీసులు దృష్టి పెట్టాలని కామెంట్లు పెడుతున్నారు.
https://www.instagram.com/reel/DH-3WnGNdf5/?utm_source=ig_web_copy_link






