- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినడానికి వింతగా ఉన్న ఇది నిజం! ఫార్ట్ వీడియోలతో లక్షలు సంపాదిస్తున్నాడు!

దిశ, వెబ్ డెస్క్: ఈ వార్త వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ, ఇది ఫేక్ కాదు.. ఫ్యాక్ట్! నిజంగానే ఆస్ట్రేలియాకు (Australia) చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో (Social media) ఫార్ట్ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన నాథ్ వైల్డ్ అనే వ్యక్తి ఒకప్పుడు కార్పెంటర్‌గా పనిచేసేవాడు. అయితే సరదాగా తీసిన ఓ ఫార్ట్ వీడియో అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నాథ్ తనకు ప్రత్యేకంగా ఫార్ట్ శబ్ధాలు చేసే టాలెంట్ ఉందని తెలుసుకొని, సరదాగా వీడియోలు చేయడం ప్రారంభించాడు. మొదట్లో కార్పెంటర్‌గా పని చేస్తూనే, సోషల్ మీడియాలో ఈ వీడియోలను అప్‌లోడ్ చేసేవాడు. కానీ అంచనాలకు మించి స్పందన రావడంతో, అదే పూర్తిగా అతని కెరీర్‌గా మారింది.
నాథ్ ఇప్పుడు తన ఫార్ట్ (అపానవాయువు) వీడియోలు విక్రయించి సంవత్సరానికి సుమారు 20,000 పౌండ్లు (రూ.23 లక్షలు) సంపాదిస్తున్నాడు. ఇక వీడియో తీసే ముందు నాథ్ ప్రత్యేక డైట్ తీసుకుంటాడు. ముఖ్యంగా వీడియోల కోసం తనకు కావాల్సిన ఫార్ట్ సౌండ్ వచ్చేలా చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తింటాడు. ఒక్క వీడియోకి ఏకంగా అతనికి 2,050 పౌండ్లు (దాదాపు రూ.2.3 లక్షలు) లభించాయి. ఈ వీడియోల ద్వారా సగటున నెలకు అతను 1,540 పౌండ్లు (రూ.1.70 లక్షలు) సంపాదిస్తున్నాడు. మొదట్లో సరదాగా చేసిన ఈ పని, ప్రస్తుతం అతనికి పూర్తి కాల ఉద్యోగం అయింది. సంపాదన బాగుండటంతో కార్పెంటర్ పని వదిలేసి ఇంట్లో నుంచే ఈ పని చేస్తున్నాడు.






