- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదేం కర్మరా బాబు.. ఇలా తయారయ్యారు! స్కూల్లో ఇద్దరు అమ్మాయిల ముద్దు సీన్ వైరల్
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం, ఫారెన్ కల్చర్ ప్రభావం నేటితరంపై అధికంగా పడుతుంది.

దిశ, వెబ్ డెస్క్: సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం, ఫారెన్ కల్చర్ ప్రభావం నేటితరంపై అధికంగా పడుతుంది. ఫలితంగా ఇటీవల కాలంలో యువత దారుణంగా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. స్కూల్ డేస్‌లోనే (School days) ప్రేమలు, ఎఫైర్‌లు నడిపిస్తున్నారు. మరికొందరైతే.. సందుల్లో, చెట్లలో, సీక్రెట్ ప్రదేశాలకు తమ లవర్స్‌లను తీసుకెళ్లి రోమాన్స్‌లు (Romance) చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం చూస్తున్నాం. ఇక సాధారణంగా మహిళలు పురుషుల పట్ల.. పురుషులు మహిళల పట్ల ఆకర్షితులవుతారు. కానీ నేటి ఆధునిక నాగరికతలో కొంతమంది పురుషులు పురుషుల పట్ల, మహిళలు మహిళల పట్ల ఆకర్షితులవుతారు. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఇక్కడ ఆకర్షితులైన ఇద్దరు అమ్మాయిలు (Two girl students) ఏకంగా స్కూల్లోనే ముద్దులతో రెచ్చిపోయారు.
వైరల్ అవుతున్న వీడియోలోని సమాచారం ప్రకారం.. స్కూలు యూనిఫాంలు ధరించిన ఇద్దరూ అమ్మాయిలు ఎవరు చూడకుండా పాఠశాల భవనం వెనక వైపుకు వచ్చారు. అక్కడ తమని ఎవరు చూడటం లేదని నిర్ధారించుకున్న ఆ ఇద్దరు అమ్మాయిలు హగ్ చేసుకుని, ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. ఎవరైనా వస్తారేమో అనే భయం ఏ మాత్రం లేకుండా ముద్దుల్లో మునిగిపోయారు. దూరం నుంచి గమనించిన వ్యక్తులు ఈ దృశ్యాలను వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు విద్యార్థినులపై తీవ్రంగా మండిపడుతున్నారు. అలాగే పాఠశాల యజమాన్యాన్ని ఏకిపారేస్తున్నారు.






