Viral video: ఇదేం ఫ్యాషన్ రా అయ్యా.. చిరిగిన బొక్కల జీన్స్ కాదు.. ఇప్పుడు ఇదే ట్రెండ్!

by Yella Dhawani Reddy |

ఫ్యాషన్‌ ప్రపంచం (Fashion world) ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటునే ఉంటుంది.

Viral video: ఇదేం ఫ్యాషన్ రా అయ్యా.. చిరిగిన బొక్కల జీన్స్ కాదు.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్యాషన్‌ ప్రపంచం (Fashion world) ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటునే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్యాషన్ మార్కెట్‌లోకి నిత్యం ఎన్నో రకాల డిజైన్లు వచ్చి చేరుతుంటాయి. అందులో కొన్ని చూసేందుకు వింతగా అనిపించినా ట్రెండీగా (Trendy) మారిపోతుంటాయి. ప్రస్తుతం అలాంటి ఫ్యాషన్‌ ట్రెండ్‌ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే, దీని డిజైన్‌యే వింతగా ఉందనుకుంటే.. ధర కూడా షాక్ ఇస్తుంది.

ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కోపర్ని (French luxury label Coperni).. వన్ లెగ్ డెనిమ్ ట్రౌజర్ (one-legged jeans) పేరుతో కొత్త రకం జీన్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ జీన్స్ స్పెషలిటీ ఏంటంటే.. ఒక కాలికి పూర్తిగా క్లాత్ ఉండగా, రెండో కాలికి షార్ట్ మారిందిగా కట్ చేసి ఉంది. ఇక ఈ వింత జీన్స్ ధర ఏకంగా రూ.38 వేలు పైనే ఉంది. కోపర్ని బ్రాండ్ మాత్రమే కాదు.. బొట్టెగా వెనెటా, లూయిస్ విట్టన్ వంటి ఇతర ప్రముఖ లేబుల్‌లు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి.

ఈ జీన్స్ వీడియోను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ క్రిస్టీ సారా షేర్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంటర్నెట్‌లో అత్యంత వివాదాస్పద జీన్స్ ఇదేనని, ఇది ఒక కాలు దుప్పటి నుంచి బయట పెట్టి నిద్రపోయినట్లు ఉందని రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఇక, ధర ఎంతైనా పర్వాలేదు.. కొత్త ఫ్యాషన్‌ మార్కెట్లోకి వస్తే చాలు యువత పోటీపడిమరీ కొనేస్తుంటారు. ఈ విషయంలో వన్‌ లెగ్ జీన్స్‌‌కి ఎలాంటి మినహాయింపు లేదు. అయితే కొంత మంది యువత మాత్రం ఈ జీన్స్‌ కొనుగోలు చేయకుండానే తమ వద్ద ఉన్న జీన్స్‌కి ఒక లెగ్‌ కట్‌ చేసి.. ఈ జీన్స్‌ స్వయంగా తయారు చేసుకుని ధరిస్తున్నారు.

Next Story