వీడు మాములోడు కాదు.. ముగ్గురు భార్యలను ఎలా మైంటైన్ చేశాడో తెలిస్తే షాకవుతారు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-06 04:51:48  IST  )

ప్రస్తుత రోజుల్లో యువత డేటింగ్ యాప్‌లలో పరిచయాలు ఏర్పడి పెళ్లిళ్లు చేసుకోవటం కామన్ అయిపోయింది.

వీడు మాములోడు కాదు.. ముగ్గురు భార్యలను ఎలా మైంటైన్ చేశాడో తెలిస్తే షాకవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో యువత డేటింగ్ యాప్‌లలో (Dating apps) పరిచయాలు ఏర్పడి పెళ్లిళ్లు చేసుకోవటం కామన్ అయిపోయింది. అయితే, ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలోని ఫోరిడాలో (Florida) వెలుగుచూసింది. విడాకులు తీసుకున్న మహిళలే (Divorced Women) లక్ష్యంగా చేసుకున్న ఓ వ్యక్తి.. డేటింగ్ యాప్‌లో వారితో ప్రేమగా మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరు.. ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. చివరికి మోసం బయటపడటంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఈ వార్త పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఫ్లోరిడాకు చెందిన హెన్రీ బెట్సే జూనియర్ అనే వ్యక్తి సోషల్ మీడియా, సహా ఇతర డేటింగ్ యాప్‌లలో నిత్యం యాక్టీవ్‌గా ఉండేవారు. ఈ క్రమంలో విడాకులు తీసుకున్న మహిళల ప్రొఫైల్‌ను గుర్తించి.. వారితో చాటింగ్‌ చేస్తూ పరిచయం పెంచుకునేవాడు. తనను అర్థం చేసుకుని.. కష్ట సుఖాల్లో తనకు తోడుగా ఉండే మహిళ కోసం వేచిచూస్తున్నట్లు వాళ్లకు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకునేవాడు. ఇలా మొదట టిండర్ (Tinder) అనే డేటింగ్ యాప్‌లో టోన్యా అనే మహిళతో పరిచయం పెంచుకున్న హెన్రీ.. 2020 నవంబరులో డువాల్ కౌంటీ కోర్ట్‌హౌస్‌లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం ఆమెతో పెళ్లి బంధంలో ఉండగానే మరో మహిళను ట్రాప్ చేశాడు. ఈసారి స్టిర్ (Stir) అనే డేటింగ్ యాప్‌లో బ్రాండీ బెట్సీని కలిసి, 2022 ఫిబ్రవరిలో మానటీ కౌంటీలో ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ఇద్దరు సరిపోలేదు అన్నట్టు.. Match.com అనే వెబ్ సైట్ ద్వారా మిషెల్ అనే మరో మహిళతో పరిచయం పెంచుకుని అదే ఏడాది హెర్నాండో కౌంటీలో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఒకరి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు.

పెళ్లి అనంతరం ఈ ముగ్గురిని హెన్నీ ఇబ్బంది పెట్టాడు. గృహ హింసకు గురిచేశాడు. ఈ క్రమంలో మొదటి భార్య టోన్యాకు హెన్నీపై అనుమానం వచ్చింది. దీంతో అతని గురించి ఎక్వైరీ చేయటం ప్రారంభించింది. ఈ క్రమంలో హెన్రీ తనతో పాటు మరో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నట్టు టోన్యా తెలుసుకుంది. వెంటనే హెన్రీ మూడో భార్య అయిన మిషెల్‌ను కలిసి జరిగిన విషయం మొత్తాన్ని చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన మిషెల్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిషెల్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెన్రీ అరెస్ట్ చేశారు. ఇక అనంతరం అతడితో ముగ్గురు భార్యలు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Read More..

పెళ్లంటే నూరేళ్ల మంటే.. కాదు కూడదని చేసుకున్నారో బుర్ర పనిచేయక లైఫ్ ఖతమ్.. సైన్స్ చెప్తంది ఇదే..

Next Story