పెళ్లంటే నూరేళ్ల మంటే.. కాదు కూడదని చేసుకున్నారో బుర్ర పనిచేయక లైఫ్ ఖతమ్.. సైన్స్ చెప్తంది ఇదే..

by Sujitha Rachapalli |

పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుందని.. మ్యారేజ్‌కు ఒప్పిస్తారు పెద్దలు. వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే చివరకు డేట్ ఫిక్స్ చేస్తారు. కానీ అక్కడే అసలు స్టోరీ మొదలవుతుందని హెచ్చరిస్తుంది తాజా అధ్యయనం. వివాహం మెమొరీ లాస్‌కు దారితీస్తుందని..

పెళ్లంటే నూరేళ్ల మంటే.. కాదు కూడదని చేసుకున్నారో బుర్ర పనిచేయక లైఫ్ ఖతమ్.. సైన్స్ చెప్తంది ఇదే..
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుందని.. మ్యారేజ్‌కు ఒప్పిస్తారు పెద్దలు. వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే చివరకు డేట్ ఫిక్స్ చేస్తారు. కానీ అక్కడే అసలు స్టోరీ మొదలవుతుందని హెచ్చరిస్తుంది తాజా అధ్యయనం. వివాహం మెమొరీ లాస్‌కు దారితీస్తుందని.. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను కిల్ చేస్తుందని తెలిపింది. మొత్తానికి మ్యారేజ్ డిమెన్షియా రిస్క్ పెంచుతుందని తెలిపింది. అందుకే మింగిల్ అవడం కన్నా సింగిల్‌గా ఉండటమే బెటర్ అని సూచిస్తుంది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయనం పూర్తి వివరాలు చూద్దాం.

వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అని ఓ సినిమా పాట హెచ్చరించినట్లుగానే ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ కూడా ఇండైరెక్ట్‌గా ఇదే వార్నింగ్ ఇస్తోంది. 24,107 మంది అమెరికన్ల డేటాను 18 సంవత్సరాల పాటు విశ్లేషించిన స్టడీ.. అధ్యయనం ప్రారంభంలో డిమెన్షియా లేనివారు, ప్రతి ఏటా క్లినికల్ టెస్ట్ చేయబడ్డారు. పెళ్లైన వారితో పోలిస్తే.. వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అసలు పెళ్లి చేసుకోని వారిలో డిమెన్షియా రిస్క్‌ తక్కువగా ఉంది. ప్రత్యేకంగా విడాకులు తీసుకున్నవారు, పెళ్లి చేసుకోనివారు (HR 0.76) తక్కువ రిస్క్‌ను చూపించారు. ఈ ఫలితాలు ఆల్జీమర్స్ డిసీజ్, లూయీ బాడీ డిమెన్షియాకు స్థిరంగా ఉన్నాయి. కానీ వాస్కులర్ డిమెన్షియా లేదా ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియాకు స్పష్టమైన సంబంధం కనిపించలేదు.

కారణాలు..

సోషల్ నెట్‌వర్క్‌:

పెళ్లి కాని వ్యక్తులు స్నేహితులు, పొరుగువారితో ఎక్కువ సామాజిక సంబంధాలను కలిగి ఉంటారు. ఇవి కాగ్నిటివ్ ఉత్తేజాన్ని అందించి డిమెన్షియా రిస్క్‌ను తగ్గిస్తాయి. కానీ వివాహితులకు ఆ అవకాశం తక్కువ.

మానసిక ఒత్తిడి:

పెళ్లిలో సంఘర్షణలు, సంరక్షణ భారం, భావోద్వేగ ఒత్తిడి మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. కాగా విడాకుల తర్వాత కొందరు సంతోషం, జీవన సంతృప్తిని అనుభవిస్తారు. ఇది కాగ్నిటివ్ డిక్లైన్‌ను నెమ్మదిస్తుంది.

సెల్ఫ్ డిపెండెంట్:

పెళ్లి కాని వ్యక్తులు సెల్ఫ్ డిపెండెంట్‌గా ఉంటారు. ఇది మానసిక సామర్థ్యాలను ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది.

పెళ్లి నాణ్యత:

అధ్యయనం పెళ్లి నాణ్యతను పరిగణనలోకి తీసుకోలేదు. కానీ సంతోషకరమైన పెళ్లిళ్లు మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని, అసంతృప్త పెళ్లిళ్లు రిస్క్‌ను పెంచుతాయని సూచిస్తుంది.

ముఖ్యంగా మహిళల్లో...

భారతదేశంలో పెళ్లైన మహిళలు ముఖ్యంగా కుటుంబ పాత్రలకు పరిమితమైనవారు.. భావోద్వేగ అసంతృప్తి లేదా వ్యక్తిగత వృద్ధి లేకపోవడం వల్ల డిమెన్షియా రిస్క్‌లో ఎక్కువగా ఉండవచ్చు. నిపుణులు ఈ అంశాన్ని హైలైట్ చేశారు. వీరు సంరక్షణ బాధ్యతలను ఎక్కువగా భరిస్తుండటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. అయితే ఇండియాలో డిమెన్షియా డయాగ్నోసిస్ తక్కువగా ఉంది. పెళ్లైన వ్యక్తులలో జీవిత భాగస్వామి లేదా కుటుంబం వల్ల లక్షణాలు త్వరగా గుర్తించబడవచ్చు. ఇది అధ్యయన ఫలితాలను ప్రతిబింబిస్తుంది. మొత్తానికి ఈ స్టడీ పెళ్లి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందనే సాంప్రదాయ నమ్మకాన్ని సవాలు చేస్తుంది. పెళ్లి కాని వ్యక్తులపై సామాజిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

Next Story