- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి ఎలకల మందు ఆర్డర్.. ఏడుస్తూ కనిపించిన మహిళ.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే?
తమిళనాడులో డెలివరీ బాయ్ సమయస్పూర్తి ఓ కుటుంబం ప్రాణాలను కాపాడింది. రాత్రి సమయంలో ఓ మహిళ బ్లింకిట్‌లో ఎలుకల మందును ఆర్డర్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో డెలివరీ బాయ్ సమయస్పూర్తి ఓ కుటుంబం ప్రాణాలను కాపాడింది. రాత్రి సమయంలో ఓ మహిళ బ్లింకిట్‌లో ఎలుకల మందును ఆర్డర్ చేసింది. ఆ ఎలుకల మందు ఆర్డర్ ఇచ్చేందుకు ఓ డెలివరీ బాయ్ వారి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ సమయంలో మహిళ ఏడుస్తూ కనిపించడంతో వారు ఆత్మహత్య చేసుకుంటారేమోనని భావించి వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. ఈ విషయాన్ని డెలివరీ బాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాళ్లు మొత్తం మూడు ఎలుకల మందు సాచెట్ లు ఆర్డర్ చేశారని చెప్పాడు.
వాళ్లు ఎందుకు ఆర్డర్ చేశారో తెలియదు కానీ డెలివరీ ఇచ్చేందుకు వెళితే ఏడుస్తూ కనిపించారని అన్నాడు. వాళ్లు అవసరం ఉంటే ఉదయం ఆర్డర్ చేసుకునేవాళ్లని, లేదంటే మరుసటి రోజు చేసుకునేవాళ్లని కానీ అర్ధరాత్రి ఆర్డర్ చేయడంతోనే అనుమానం వచ్చిందన్నారు. ఆమెకు నచ్చజెప్పి ఆర్డర్ క్యాన్సిల్ చేశానని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు డెలివరీ బాయ్ చూపించిన సమయస్పూర్తికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాకుండా లక్షల మంది వీడియోను లైక్ చేస్తున్నారు.






