- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video Viral:నమ్మించి మోసం చేయడంలో ఈ పక్షి ఫస్ట్.. ఇంతకీ దాని పేరేమిటో తెలుసా?
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో జంతువులకు సంబంధించి వీడియోలు నిత్యం దర్శనమిస్తునే ఉన్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో జంతువులకు సంబంధించి వీడియోలు నిత్యం దర్శనమిస్తునే ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. ఈ క్రమంలో ఎక్కువగా పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా అవుతుండడం గమనిస్తూనే ఉన్నాం. అయితే, అడవిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు నివాసం ఉంటాయి. ఇక జంతువుల వేట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహాలు, పులులకు సంబంధించి వీడియోలు డిస్కవరీ ఛానల్‌లో లేదా మొబైల్‌లో చూస్తుంటారు. జంతువుల వేట చూస్తే భయంకరంగా ఉంటుంది.
పక్షులకు సంబంధించిన వీడియోలు(Videos), కథలు భలే సరదాగా అనిపిస్తాయి. చిన్ననాటి పాఠ్యపుస్తకాల్లో కూడా పక్షుల వేట గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. నక్క తెలివి, మూడు చేపలు, నక్క మోసం-మృగరాజు శిక్ష, మూడు చేపలు, కొంగ జపం వంటి ఎన్నో కథలు చదివే ఉంటారు. పక్షుల వేట ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవి ఇతర పక్షులను మోసం చేసి తమ కడుపు నింపుకోవడం చూస్తే షాకింగ్‌గా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని రకాల పక్షుల స్వభావం విభిన్నంగా ఉంటుంది. ఆహారం సంపాదించుకోవడానికి రకరకాలుగా ఉపాయం చేస్తాయి.
ఇకపోతే.. చేపల్ని వేటడంలో పక్షులకు ఓ స్టైల్ ఉంటుంది. కొంగ గురించి తెలిసిందే. దాని వేట కోసం దొంగ జపం చేస్తు నమ్మిస్తుంది. ఇక కింగ్ ఫిషర్ వేగంగా నీటిలోకి దూసుకెళ్లి వేటాడుతుంది. కానీ వేటలో బ్లాక్ హెరాన్(Black Heron) మాత్రం సపరేటు స్టైల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. వేటలో బ్లాక్ హెరాన్(నల్ల కొంగ) చాలా ఈజీగా నమ్మించి గొంతు కోస్తుంది. బ్లాక్ హెరాన్ మెల్లిగా నీటిలోకి వెళ్లి రెక్కలను గొడుగులా కప్పుకుని జలచరాలను ఆకర్షిస్తుంది. ఇక నీడలా ఉందని చేపలు ఆ రెక్కల కిందికి వచ్చి తలదాచుకుంటాయి. ఇంకేముంది ఈ పక్షి వాటిని గుటుక్కున మింగేసి జారుకుంటుంది. నల్ల కొంగ వేటను ఈ వీడియోలో చూడొచ్చు.






