- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని విదిశ నగరంలో జరిగిన ఓ విచిత్ర దొంగతనం అందరినీ షాక్ కు గురి చేసింది. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇటీవలే రూ.8 లక్షలు ఖర్చు చేసి రద్దీ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారులు. కానీ రాత్రికి రాత్రే మెయిన్ రోడ్డుతోపాటు పలు జంక్షన్లలోని స్పీడ్ బ్రేకర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ప్రాంతాల్లో నిత్యం జనాల రద్దీ ఉండటంతో పాటు పోలీసుల నిఘా కూడా ఎక్కువగా ఉంటుంది. అయినా ఎవరికి తెలియకుండా దొంగలు స్పీడ్ బ్రేకర్లను చోరీ చేసారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైనే ఉన్న స్పీడ్ బ్రేకర్లే కాపాడలేకపోతే ఇక సామాన్యుల భద్రత పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ వింత దొంగతనంపై 'ఇంకా ఏమీ దొరకలేదా బాబూ' అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.






