- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటల్లో ఎంజాయ్ చేశారు.. బిల్లు కట్టకుండా పారిపోయారు.. కట్ చేస్తే..
గుజరాత్‌కు చెందిన కొందరు ఫ్రెండ్స్ రాజస్థాన్ పర్యటనకు వచ్చారు. సిరోహీ జిల్లా అబురోడ్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో సేదతీరారు. లంచ్ కోసం దాదాపు రూ. 11వేలు బిల్ చేశారు. కడుపు నిండా తిన్నారు. కానీ

X
దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌కు చెందిన కొందరు ఫ్రెండ్స్ రాజస్థాన్ పర్యటనకు వచ్చారు. సిరోహీ జిల్లా అబురోడ్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో సేదతీరారు. లంచ్ కోసం దాదాపు రూ. 11వేలు బిల్ చేశారు. కడుపు నిండా తిన్నారు. కానీ డబ్బులు చెల్లించకుండానే కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో హోటల్ యజమాని వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
వేగంగా స్పందించిన పోలీసులు.. అంబాజీ రోడ్ సమీపంలో పర్యాటకుల కారును అడ్డుకున్నారు. యజమానికి డబ్బులు చెల్లించాలని సూచించారు. దీంతో పూర్తి బిల్ పే చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పారిపోవడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వారిని శిక్షించాలని మరికొందరు సూచిస్తున్నారు.
Next Story






