- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2025:శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. ముఖ్యమైన పండుగలు ఇవే!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నిన్న(ఆదివారం) శ్రీ విశ్వావసు సంవత్సరాది ఉగాది పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నిన్న(ఆదివారం) శ్రీ విశ్వావసు సంవత్సరాది ఉగాది పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అయితే.. తెలుగు సంవత్సరాలలో చైత్రమాసం మొదటి నెలగా చెబుతుంటారు. వసంత ఋతువు ఆగమనాన్ని సూచించే చైత్ర మాసంలో ఎన్నో పండుగలు, మరెన్నో విశేష తిథులు ఉంటాయి. వసంత ఋతువులో తొలి మాసం, తెలుగు సంవత్సరంలో మొదటి నెల చైత్రమాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పండుగ. ఆ తర్వాత శ్రీరామనవమి, హనుమన్ జయంతి వంటి పండుగలు వస్తాయి.
ఈ విశ్వావసు సంవత్సరంలో శుభముహూర్తాలు అధికంగా ఉన్నట్లు సిద్దాంతులు తెలిపారు. అయితే చాలా మంది ఉగాది రాగానే ఈ ఏడాది బతుకమ్మ, రాఖీ ఇంకా తదితర పండుగలు ఎప్పుడు వచ్చాయో అని క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాబోయే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం.
ఏప్రిల్
6-శ్రీరామనవమి, భద్రాద్రి సీతారామ కళ్యాణం
12 -చైత్రపూర్ణిమ
12- ఒంటిమిట్ట కోదండ రామయ్య కళ్యాణం
30- అక్షయ తృతీయ
మే
7 -వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన
15 -సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం
22 -హనుమజ్జయంతి
జూన్
11- ఏరువాక పూర్ణిమ
21- అంతర్జాతీయ యోగా దినోత్సవం
29 -బోనాలు ప్రారంభం
జులై
6- తొలి ఏకాదశి
10- గురుపూర్ణిమ
25 -శ్రావణమాసం ప్రారంభం
ఆగస్టు
8- వరలక్ష్మీ వ్రతం
9 -రాఖీపూర్ణిమ
16- శ్రీకృష్ణష్టామి
27- వినాయక చవితి
సెప్టెంబర్
30- దుర్గాష్టమి సద్దుల బతుకమ్మ
31- మహానవమి
అక్టోబర్
2 -విజయదశమి
20 -నరక చతుర్దశి, దీపావళి
22 -కార్తీక మాసం ప్రారంభం
25- నాగుల చవితి
27- తొలి కార్తీక సోమవారం
జనవరి
14 -భోగి
15- సంక్రాంతి
16- కనుమ
17- ముక్కనుమ
18- కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం
23- వసంత పంచమి
30- మేడారం సమ్మక్క సారలమ్మ జాతర
ఫిబ్రవరి
15 -మహాశివరాత్రి
మార్చి
2- హోళీ
3 -పాక్షిక చంద్రగ్రహణం
19- శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది
చైత్రమాసం ఎప్పటి నుంచంటే?
నిన్నటి (మార్చి ౩౦) నుంచి మొదలై తిరిగి ఏప్రిల్ 27 వ తేదీ ఆదివారం అమావాస్యతో చైత్రమాసం ముగుస్తుంది.
నోట్: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా సేకరించింది మాత్రమే. ఏమైనా సందేహాలు ఉంటే జ్యోతిష్య నిపుణులను సంప్రదించగలరు.






